ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు.  నాటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేస్తున్న సంస్కరణలు..మార్పులు చేర్పులు..నిర్ణయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. తాజాగా సీఎం జగన్ మోహర్ రెడ్డి గురించి సినీ నటుడు జేడీ చక్రవర్తి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


జేడీ చక్రవర్తి కీలకపాత్రలో నటించిన ’హిప్పీ’ మూవీ గురువారం విడుదలైన  సందర్భంగా ఓ ఆంగ్ల మీడియా ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పదేళ్లలో జగన్‌లో చాలా మార్పువచ్చిందని, ఇప్పుడు ఆయన అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారని అన్నారు.  2008 లో ఓసారి విమాణ ప్రయాణంలో నేను జగన్ పక్కపక్కనే కూర్చున్నాం.  ఆ సమయంలో నా కాలుకు గాయం కావడం వల్ల నేను వీల్ చైర్ అడుతుంటే..పక్కనే ఉన్న జగన్ గమనించకుండానే ఉన్నారు. 


ఈ విషయంలో నేను షాక్ తిన్నాను..నేను ఒక యాక్టర్ అని ఆయనకు తెలియదా గుర్తుపట్టలేదా అని రక రకాల ఆలోచనలు వచ్చాయి...ఆ సమయంలో నేను కాస్త బాధపడ్డానని అన్నారు.  అదే జగన్ గత ఏడాది విమానాశ్రయంలో కనిపించినప్పుడు ‘ఎలా ఉన్నారు?’ అంటూ అప్యాయంగా పలకరించారు..కుశల ప్రశ్నలు వేశారు...అప్పుడు నేను చాలా సంతోషించాను. అంటే ఈ పదేళ్లలో జగన్ లో ఎంతో గొప్ప మార్పు వచ్చింది..ఆయనపై ప్రజలు ఉంచుకున్న విశ్వాసం వంద శాతం కరెక్ట్ అని అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: