పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.  సాంగ్స్ షూటింగ్ జరుపుకుంటోంది.  ఇందులో ఇద్దరు హీరోయిన్లు.  అందులో ఒకరు నిధి అగర్వాల్ కాగా రెండో హీరోయిన్ నభా నటేష్.  ఈ ఇద్దరు భామలు హాట్ హాట్ గా కనిపిస్తూ కనువిందు చేస్తున్నారు.  

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ లుక్ ను ఈరోజు రోలీజ్ చేశారు.  ఇద్దరు హాట్ భామల నడుమ ఇస్మార్ట్ గా నిలబడ్డాడు రామ్.  పక్కా హైదరాబాద్ సినిమాగా చెప్పుకుంటున్న ఈ సినిమాలో సూపర్బ్ గా అనిపించే సీన్స్ ఎన్నో ఉన్నాయి.  ఇందులో దిమాక్ ఖరాబ్ అనే సాంగ్ ఉంది.  

తెలంగాణా యాసలో మాంచి తీన్ మార్ ఊపులో ఈ పాటను సంగీత ప్రియులకు పిచ్చెక్కించేలా వండి వార్చారట. ఆ పాటకు శాంపిల్ అన్నట్టుగా ఒక పోస్టర్ ను వదిలారు.  రామ్ మంచి డ్యాన్సర్ అనే సంగతి తెలిసిందే. ఇక అటు ఇటూ నిధి.. నభా ఉంటే డబల్ జోష్ లో డ్యాన్స్ వేస్తాడేమో. పోస్టర్లో హీరోయిన్లు ఇద్దరూ ఒకేరకమైన ఛోళీ..లెహెంగా వేసుకొని అందాలను ధారపోస్తూ నిలబడ్డారు.

ఇదిలా ఉంటె ఈ సినిమాలోని ఈ సాంగ్ ను ఈరోజు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు.  మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో.. ఎంతమందిని ఎలా ఆకట్టుకుంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: