బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా సీనియర్ డైరక్టర్ తేజ డైరక్షన్ లో వచ్చిన సినిమా సీత. మే 24న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. కాజల్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డది. అయినా ఆడియెన్స్ కు పెద్దగా రుచించలేదు. సీత సినిమా 14.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.


అయితే దాదాపు అన్నిచోట్ల ఈ సినిమా కలక్షన్స్ ముగిసినట్టే కనిపిస్తుంది. ఇప్పటివరకు ఓవరాల్ కలక్షన్స్ 5 కోట్లకు అటు ఇటుగానే ఉన్నాయట. అంటే ఎలా లేదన్నా సీత సినిమా 10 కోట్ల నష్టమే. సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ అందరు సీత సినిమాకు నష్టాలపాలవ్వాల్సి వచ్చింది. తేజ సినిమా అంటే ఇదవరకు మినిమం మార్కెట్ ఉండేది కాని ఇప్పుడు అదికూడా కష్టమని తెలుస్తుంది.  


ఇక నిర్మాత కొడుకుగా హీరోగా ఎంట్రీ ఇచ్చి ఐదేళ్లు అవుతున్నా బెల్లంకొండ శ్రీనివాస్ కు ఒక్కటంటే ఒక్క హిట్టు ఇప్పటివరకు పడలేదు. తక్కువ బడ్జెట్ తో తీసినా సరే బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడుతున్నాయి. ఎన్నో హోప్స్ పెట్టుకున్న సీత ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు సినిమా చేస్తున్నాడు.


ఈమధ్య వచ్చిన ఈ సినిమా టీజర్ ఇంప్రెస్ చేసింది. రమేష్ వర్మ డైరక్షన్ లో తమిళ సూపర్ హిట్ మూవా రాక్షసన్ కు అఫిషియల్ రీమేక్ గా రాక్షసుడు వస్తుంది. ఈ మూవీలో శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. మరి రాక్షసుడుతో అయినా బెల్లంకొండ హీరోకి హిట్ దక్కుతుందేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: