ఇటీవల గత కొద్దిరోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తమిళ డబ్బింగ్ సినిమాలు పెద్దగా ఆడడం లేదనే చెప్పాలి. అయితే వాటిలో ఒకటి రెండు కాస్త పర్వాలేదనిపించినప్పటికీ, అవి అంత పెద్ద విజయాన్ని అయితే అందుకోలేదనే చెప్పాలి. ఇకపోతే మొన్న ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య కొత్త సినిమా ఎన్జీకే అయన కెరీర్ లో మరొక పరాజయంగా నిలిచింది. 

కేవలం తెలుగులోనే కాదు తమిళనాడులోనూ ఈ సినిమా పెద్దగా ఆడడం లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక మొదటినుండి తన చిత్ర విజయాలను ఎంతో హుందాగా స్వీకరించే సూర్య, నేడు మరొక్కసారి తన సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ ద్వారా ఎన్జీకే సినిమా పరాజయంపై ఎంతో పాజిటివ్ వె లో స్పందించి మరొక్కసారి మంచి మనసున్న హీరోగా తన గొప్పతనాన్ని చాటుకున్నారు. ఇక అయన తన పోస్టులో, ఎన్జీకే చిత్రంపై మీ అభిప్రాయాలని, ప్రేమని, ఆలోచనలని గౌరవంగా స్వీకరిస్తున్నా. 

అలాగే చిత్రంలో నటీనటుల పెర్ఫామెన్స్ ని మెచ్చుకున్న వారందరికీ ధన్యవాదాలు. ఇక ఈ చిత్రం కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు, ఇకపై మిమ్మల్ని అందరిని అలరించే మంచి చిత్రాల్లో నటించడానికి ప్రయత్నిస్తాను అంటూ ట్వీట్ చేశాడు. అయితే సూర్య మొదటినుండి జయాపజయాలను ఎంతో హుదగా స్వీకరిస్తారని, ఇక తన కొత్త సినిమా ఎన్జీకే పరాజయంపై అయన ఈ విధంగా ట్వీట్ చేయడంతో అయనపై గౌరవం మరింత పెరిగింది అంటూ పలువురు నెటిజన్లు అయన ట్వీట్ కు రిప్లై ఇస్తున్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: