కంగన అద్భుతమైన హీరోయిన్..ఇలాంటి హీరోయిన్స్ చాలా రేర్ గా దొరుకుతారు. ఇలాంటి హీరోయిన్స్ దొరకడం ఫిల్మ్ ఇండస్ట్రీ కి ఎంతో అవసరం. అయితే హీరోయిన్‌గా ఎంత పాపులారిటీ వచ్చిందో అంతకు మించి కాంట్రవర్సీస్ లోను నిత్యం ఉంటోంది. గత కొంత కాలంగా అయితే రచయితలు - దర్శకుల పనితనం నచ్చకపోతే నిర్మొహమాటంగా మెడపట్టి గెంటేసి తిరిగి వాళ్ల స్థానంలో తానే ఛార్జ్ తీసుకుంటూ కంగన ఆడుతున్న ఆట తెలిసిందే. రైటింగ్ నచ్చలేదంటూ రైటర్లతో.. దర్శకత్వం నచ్చలేదంటూ దర్శకులతోనూ గొడవలు పెట్టుకుంటూ కంగన చుక్కలు చూపిస్తోంది. నచ్చని వ్యవహారాల్లో నిర్మొహమాటంగా ఉంటూ  ఇండస్ట్రీ బ్యాడ్ గాళ్ గా పాపులరైంది. 


మణికర్ణిక- ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ విషయంలో ఇలానే క్రిష్ తో కంగన వివాదం సంచలనమైన సంగతి అందరికి తెలిసిందే. దానివల్లే క్రిష్ ఆ ప్రాజెక్టును మధ్యలోనే వదిలేసి హైదరాబాద్ కి వచ్చేస్తే కంగన టేకోవర్ చేసింది. పెండింగ్ ఉన్న 10  శాతం షూటింగ్ తనే దర్శకత్వం వహించింది. ఒక భోజ్ పురి సినిమాలా తీశాడు క్రిష్!! అంటూ తీవ్రంగా విమర్శించిన కంగన మొత్తం  సక్సెస్ క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక మరోసారి మరో తెలుగు దర్శకుడికి అలాంటి స్ట్రాటజీని చూపెడుతుందా అన్న ప్రశ్న అందరికి మొదలైంది.


కంగన ప్రధాన పాత్రలో నటిస్తున్న మెంటల్ హై క్యా సినిమాకి తెలుగు దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అతడి పనితనం క్వీన్ కి అస్సలు నచ్చలేదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావ్ పాత్రను హైలైట్ చేస్తూ తన పాత్రను తగ్గించడంపై కంగన అసంతృప్తితో ఉందట. అసలే మేల్ డామినేషన్ నచ్చని క్వీన్ ఈసారి ఏం చేయబోతోంది? అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది.  అయితే ఈ రూమర్లపై ప్రకాష్ కోవెలమూడి స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని.. షూటింగ్ స్మూత్ గా సాగుతోందని తెలిపారు. కంగన- రాజ్ కుమార్ రావ్ ఇద్దరితో కలిసి పని చేయడం గొప్ప అనుభవాన్నిచ్చిందని క్లారిటీ ఇచ్చాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: