సినిమా అంటేనే ప్రయాణం.  సినిమాకోసం ఎక్కడి నుంచి ఎక్కడికో ప్రయాణం చేయాల్సి వస్తుంటుంది.  ఇక సినిమాల్లో బిజీ అయితే, ఈ ప్రయాణాలు మరింత ఎక్కువ.  అసలు విషయానికి వస్తే, బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ ముంబాయి నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌కి, దుబాయ్‌ నుంచి ఇస్తాంబుల్‌..


అక్కడ నుంచి అనటియా..మళ్లీ ఇస్తాంబుల్‌, అక్కడ నుంచి ముంబాయి వరసగా ప్రయాణం చేసింది.  ఇలాగే ఆరు నెలలు నుంచి ఆమె షెడ్యూల్‌ సాగుతోంది. నిత్యం బిజీ. కుటుంబ సభ్యులకు కూడా ఆమె అందుబాటులో ఉండడం లేదట. ప్రస్తుతం బాలీవుడ్‌లో చాలా బిజీగా ఉన్న కథానాయిక ఈమె ఒక్కరే. 


మల్టీపుల్‌ ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉండడంతో ఆ సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకు నిత్యం విమానంలోనే ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.  హైదరాబాద్‌లో 'సాహో' షూటింగ్‌కి, దుబాయిలో 'స్ట్రీట్‌ డాన్సర్‌ 3డీ' ఇస్తాంబుల్‌కు మరో సినిమాకు ఇలా ఎక్కువ సమయం ప్రయాణిస్తుంది.


 ఒక సినిమాకు మరో సినిమాలో చేసే పాత్రకు ఎటువంటి సంబంధమూ ఉండదు. ఇలా ఒక చిత్రం షూటింగ్‌లో పాల్గొని మరో సినిమా సెట్స్‌పై షూట్‌లో పాల్గొనడం, ఆ పాత్రకు తగ్గట్టు నటించడం పెద్ద సాహసమే.


మరింత సమాచారం తెలుసుకోండి: