‘జనసేన’ పరాజయ కారణాలు విశ్లేషిస్తూ మంగళగిరి లోని జనసేన కార్యాలయంలో నిన్న బిజీగా కాలం గడిపిన పవన్ కళ్యాణ్ ఒక జనసేన నాయకుడు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ తాను సినిమాలను పూర్తిగా వదిలి వేసినట్లు క్లారిటీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. అంతేకాదు మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం తాను ఏ దర్శకుడు చెపుతున్న కథలను వినడం లేదనీ ప్రస్తుతం తన దృష్టి అంతా ‘జనసేన’ పార్టీని పునర్జీవించడం విషయం పై ఉంది అని క్లారిటీ ఇవ్వడంతో ఇక పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమైన్నట్లే అన్న స్పష్టమైన క్లారిటీ వచ్చింది.

ఇలాంటి పరిస్థుతులలో పవన్ దృష్టికి వచ్చిన ఒక వీరాబిమాని చేసిన ట్విట్ పై ఆశ్చర్యాన్ని వ్యక్త పరిచినట్లు టాక్. ఆ వీరాభిమాని తన ట్విట్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడో ఒక చోట ఉపఎన్నికలు వచ్చి అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచి అసెంబ్లీకి వెళ్లాలని దేవుడిని కోరుకున్నట్టు రాశాడు. తెలిసిరాసాడో తెలియకరాసాడో గానీ ఇప్పుడు ట్విట్టర్ లో ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. 

అయితే ఈ ట్విట్ పై విమర్శలు కూడ విపరీతంగా వస్తున్నాయి. సాధారణంగా ఉప ఎన్నికలు ఒక వ్యక్తి తన ఎమ్.ఎల్.ఏ స్థానానికి రాజీనామా చేసినప్పుడు కానీ లేదంటే ఆవ్యక్తి చనిపోయినప్పుడు కానీ ఉప ఎన్నికలు వస్తుంటాయి. దీనితో కొందరు ‘మీ  నాయకుడు అసెంబ్లీకి వెళ్ళడానికి ఎవరో ఒక ఎమ్మెల్యే చనిపోవాలని కోరుకుంటున్నావా’ అంటూ ఆ సదరు అభిమాని పై విరుచుకుపడుతున్నారు. అంతేకాదు ‘జనసేన’ అభిమానుల కుసంస్కారం ఇది అంటూ ఘాటైన కామెంట్స్ కూడ చేస్తున్నారు.

దీనితో పవన్ కళ్యాణ్ అభిమానుల అత్యుత్సాహం అతడికి శాపంగా మారుతుందా అంటూ మరికొందరు జోక్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడినా కూడ పవన్ తన గుబురు గెడ్డంను తీయకపోవడంతో అసలు పవన్ మొక్కు ఎప్పటికి తీరుతుంది అని అడిగే సాహసం చేయలేక జనసైనికులు లోలోపలే మధన పడుతున్నట్లు టాక్..    



మరింత సమాచారం తెలుసుకోండి: