జబర్దస్త్ పేరు వినగానే ముందుగా మన మనసుల్లో మెదిలేది నాగబాబు మరియు రోజా . వాళ్ళిద్దరి కల్మషం లేని నవ్వులు జబర్దస్త్ ను ఒక స్థాయిలో నిలబెట్టాయి. జబర్దస్త్ లాంటి కార్యక్రమాలు మిగతా చానెళ్ళు ట్రై చేసినా ఆ ప్రోగ్రామ్స్ అంతగా సక్సెస్ కాలేదు. ఈ కార్యక్రమం విజయంలో స్కిట్స్ చేసిన వాళ్ళ టాలెంట్ ఎంత ఉందో జడ్జీలుగా పని చేసిన నాగబాబు రోజా కృషి అంతే ఉంది.


అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినందుకు కొన్ని వారాల పాటు జబర్దస్త్ షోకు నాగబాబు రోజా హాజరు కాలేదు. వారి స్థానాల్లో కొన్ని రోజుల పాటు మీనా, శేఖర్ మాస్టర్, సంఘవి , అలీ జడ్జీలుగా ఉన్నారు. ఇన్ని రోజులు జబర్దస్త్ కార్యక్రమానికి హాజరు కాని నాగబాబు వచ్చే వారం నుండి ఈ షోకు వస్తున్నట్లు ప్రోమోల ద్వారా తెలుస్తుంది

 

ఇదే సమయంలో రోజా రెండో సారి ఎన్నికల్లో గెలిచినందుకు ఆమెకు ఖచ్చితంగా మంత్రి పదవి లభించబోతుంది. ఎమ్మెల్యేగా రోజా జబర్దస్త్ కు జడ్జీగా వ్యవహరించినప్పటికీ మంత్రి పదవి పొందాక కాల్షీట్లు కేటాయించడం కష్టం. నాగబాబు జబర్దస్త్ లోకి వచ్చే సమయానికి రోజా జబర్దస్త్ వదిలేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ రోజా ఈ కార్యక్రమానికి గుడ్ బై చెబితే ఈ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో చూడాలి


మరింత సమాచారం తెలుసుకోండి: