అపుడెపుడో టబు తొలి మూవీ కూలీ నంబర్ వన్ వెంకటేష్ పెయిర్ గా చేసింది. అందులో ఎప్పటికీ మరచిపోలేని ఓ రొమాంటిక్  సాంగ్ ఉంది. కలయా నిజమా తొలిరేయి హాయి మహిమా అని, అసలే డైరెక్టర్ రాఘవేధ్రుడు. ఆ సాంగ్ ని చాలా బాగా తీసి రసికుల హ్రుదయాలకు అలా అంటించేశాడు. ఇక తరువాత టబు ఎన్నో మూవీస్ చేసి అందంగా మెరిసింది.


ఇపుడు మరో మారు టబు నాటి రసిక గుండెలను తట్టి లేపడంతో పాటు, నేటి యువతను కూడా అట్రాక్ట్ చేసేందుకు సై అంటోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రం కొత్త మూవీ బన్నీతో చేస్తున్నారు. అందులోటబు కీలకమైన పాత్రలో కనిపిస్తుందని టాక్.


మరి పొగరుబోతు అత్తగానే, లేక సినిమాను మలుపు తిప్పే అతివగానా ఏ రకంగా టబు  కనిపిస్తుందన్నది సస్పెన్స్. త్రివిక్రం అంటేనే మాజీ హీరోయిన్లకు సూపర్ స్టార్ డం మళ్ళీ తీసుకువచ్చే డైరెక్టర్. నదియాను అత్తారింటికి  దారేదీ మూవీతో ఎక్కడికో తీసుకెళ్ళిన ఈ మాటల మాంత్రికుడు టబూకు కూడా టాప్ రేంజిలో నిలబెట్టే రోల్ ఇస్తాడని అంటున్నారు. చూడాలి. అల్లు అర్జున్ టబూ చాలెంజింగ్ రోల్స్ ఎలా స్క్రీన్ మీద మెరుస్తాయో.


మరింత సమాచారం తెలుసుకోండి: