విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘దొరసాని’ టీజర్ లేటెస్ట్ గా విడుదలైంది. ఈ టీజర్ పై విజయ్ స్పందిస్తాడని అతడి అభిమానులు అంతా ఎదురు చూసారు. అయితే విజయ్ దొరసాని పై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో తన తమ్ముడు సినిమాకు దూరంగా ఉండాలని విజయ్ భావించి ఉంటాడు అంటూ అభిమానులు అభిప్రాయపడ్డారు. 

అయితే సంఘటన జరిగి రెండు రోజులు కూడ అవ్వకుండానే లేటెస్ట్ గా విడుదలైన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా ట్రయిలర్ ను భుజానికెత్తుకుని విజయ్ దేవరకొండ ప్రచారం చేయడం విజయ్ అభిమానులకు ఆశ్చర్యంగా మారింది. ఈ మూవీ ట్రైలర్ ను విజయ్ తన అభిమానులకు షేర్ చేస్తూ ప్రశంసలు కురిపించడంతో సొంత తమ్ముడుని వదిలేసి బయట సినిమాలను ప్రమోట్ చేస్తున్నావా అంటూ విజయ్ పై విపరీతంగా సెటైర్లు పడుతున్నాయి. 

వాస్తవానికి విజయ్ కి తన తమ్ముడు ఇండస్ట్రీలోకి వచ్చే విషయమై పెద్దగా ఆసక్తి లేదు అన్న గాసిప్స్ ఉన్నాయి. దీనికితోడు ‘దొరసాని’ ట్రైలర్ లో ఆనంద్ దేవరకొండ నటన చెప్పుకో తగ్గ స్థాయిలో లేకపోవడంతో విజయ్ ఆ మూవీ ట్రైలర్ ను ప్రమోట్ చేసి ఉండడు అన్న అభిప్రాయాలు ఉన్నాయి.

అయితే తమ్ముడు సినిమాను వదిలి విజయ్ వెంటనే రిలీజ్ అయిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ట్రైలర్ ను ప్రమోట్ చేయకుండా ఉంటే బాగుండేది అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మధ్య అల్లు అర్జున్ కు అల్లు శిరీష్ ‘ఎబిసిడి’ సినిమా విషయంలో కూడ ఇలాంటి విమర్శలే ఎదురయ్యాయి. దీనితో హీరోల తమ్ముళ్ళు సినిమాలు విడుదలైనప్పుడల్లా హీరోలకు ఇలా ఊహించని తలనొప్పులు ఎదురౌతున్నాయి అనుకోవాలి..     


మరింత సమాచారం తెలుసుకోండి: