తమిళ్ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో యాక్షన్ హీరో  గోపీచంద్‌ హీరోగా  ఓ సినిమా రాబోతున్న  సంగతి తెలిసిందే. యాక్షన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతోన్న  ఈ సినిమాలో గోపీచంద్‌  గూఢచారి పాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేసింది చిత్రబృందం. బాలయ్య  సూపర్ హిట్ ఫిల్మ్ 'బంగారు బుల్లోడు' టైటిల్ నే  ఈ సినిమా టైటిల్ గా పెట్టనున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.  1993లో బాలయ్య హీరోగా  వచ్చిన 'బంగారు బుల్లోడు' మ్యూజికల్ గా క్లాసిక్ హిట్ అయింది. మరి గోపీచంద్ కి ఈ టైటిల్ ఎంతవరకు కలిసి వస్తోందో చూడాలి. 


కాగా, నిన్నటి నుండి హైదరాబాద్ లో ఈ సినిమా  కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్ లో యాక్షన్  సన్నివేశాలనే ప్రధానంగా చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మాణంలో వస్తోన్న 


ఈ స్పై థ్రిల్లర్ లో  గోపీచంద్ సరసన  బబ్లీ గర్ల్ మెహ్రీన్ కౌర్ మరియు బాలీవుడ్ హాట్ బ్యూటీ జరీన్ ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  
ఇక ఈ డిసెంబర్ లో  ఈ సినిమాను విడుదల చెయ్యాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇండో -పాక్ బోర్డర్ పరిసర ప్రాంతాల్లో వచ్చే భారీ  యాక్షన్ సీక్వెన్స్ స్   ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయట. 


మరింత సమాచారం తెలుసుకోండి: