అనసూయ అనగానే జబర్దస్త్ గుర్తుకు వస్తుంది.  జబర్దస్త్ అంటే అనసూయ గుర్తుకు వస్తుంది.  అనసూయ యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాలు చేస్తున్నది.  క్షణం,రంగస్థలం, కథనం వంటి సినిమాలు చేసిన ఈ యాంకర్ కు రంగస్థలం సినిమాతో మంచి పేరు వచ్చింది.  ఇప్పుడు సినిమాల్లో మెయిన్ పాత్రలు ఉంటె అందరు అనసూయ వైపు చూస్తున్నారు.  

మెగాస్టార్ చూపులు కూడా రంగమ్మత్త వైపుకు మళ్ళాయి.  సైరా సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్నారు.  ఇందులో మెగాస్టార్ డబల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.  రైతుల సమస్యలకు సంబంధించిన సినిమా.  మామూలుగానే కొరటాల సినిమాల్లో సోషల్ మెసేజ్ ఉంటుంది.  దాంతో పాటు కమర్షియల్ వ్యాల్యూస్ కూడా ఉంటాయి.  

మెగాస్టార్.. కొరటాల సినిమా చిరంజీవి పుట్టిన రోజున అంటే ఆగష్టు 22 వ తేదీన ప్రారంభం కాబోతున్నది.  ఇందులో అనసూయను ఓ మెయిన్ రోల్ కోసం తీసుకుంటున్నారట.  కీలకమైన రోల్ అంటే మెగాస్టార్ పక్కన హీరోయిన్ గా చేస్తోందా.. ఏమో చెప్పలేం.  రంగమ్మత్త పాత్రతో మంచి మార్కులు కొట్టేసింది కదా.  

అంతేకాదు, రంగమ్మత్త పాత్రలో అదరగొట్టింది.  మల్టీ టాలెంటెడ్ యాక్టర్ కావడంతో ఆమెకు అవకాశం కల్పించాలని అనుకున్నారేమో.  ఈ పాత్రకోసం రంగమ్మత్తకు భారీ పారితోషికం ఇవ్వబోతున్నారని కూడా తెలుస్తోంది.  అదృష్టం అంటే అనసూయాదే అని చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: