ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ గా వెలిగిపోతూ.. ఆ నలుగురిలో ఒకడిలా  తెలుగు సినిమాకి పెద్ద దిక్కుగా ఉన్నాడు దిల్ రాజు. అయితే గత ఏడాది మాత్రం ఈ స్టార్ ప్రొడ్యూసర్ కి చేదు అనుభవాలనే మిగిల్చింది.  నిర్మాతగా  'లవర్, శ్రీనివాస్ కళ్యాణం, హలో గురు ప్రేమ కోసమే' అంటూ మూడు  ప్లాప్ లను ఎదురుకుంటే.. ఇక డిష్టిబ్యూటర్ గా  ఏకంగా ఆరు ప్లాప్ లను మూట కట్టుకున్నాడు. పైగా దిల్ రాజు  బ్యానర్ నుండి  పంపిణి చేసిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా  పడ్డాయి. దాంతో అప్పటివరకూ ప్లాన్ చేసిన సినిమాలన్నిటికీ ఒక్కసారిగా బ్రేక్ లు వేసేశాడు దిల్ రాజు. 


అయితే  ఎట్టకేలకూ మళ్లీ 'ఎఫ్ 2, మహర్షి' చిత్రాల రూపంలో భారీ విజయాలను అందుకున్నాడు. దాంతో దిల్ రాజుకి ఎక్కడ లేని ఊపు వచ్చేసినట్లు ఉంది, ఒకే సమయంలో   వరుసగా 'ఇద్దరి లోకం ఒక్కటే', 'వి', '96' రీమేక్,  నాగ చైతన్య సినిమా,  వినాయక్ హీరోగా చేస్తోన్న సినిమా, అల్లు అర్జున్ 'ఐకాన్',  శ్రీనివాస్ కళ్యాణం దర్శకుడితో మరో సినిమా.. ఇలా మొత్తం  ఎనిమిది సినిమాల నిర్మాణానికి ఇప్పటికే  శ్రీకారం చుట్టాడు. 


అయితే దిల్ రాజుకి ఈ  కొత్త  ఉత్సహాన్ని ఇచ్చింది మాత్రం ఎఫ్2 రాబట్టిన 80కోట్ల షేర్, అలాగే 'మహర్షి' కలెక్ట్ చేసిన 180 కోట్ల షేరే. ఏమైనా 'ఎఫ్ 2', 'మహర్షి'  ఆయనకు ఊహించని విజయాన్ని అందించాయి. అందుకే పై సినిమాలతో పాటు మరో ఇద్దరు యంగ్ హీరోలతో కూడా సినిమాలు చేస్తానని ఒప్పందాలు చేసుకున్నాడట. మొత్తానికి ప్రొడక్షన్ లో.. ప్రీ ప్రొడక్షన్ లో.. ఉన్న ఈ సినిమాల లిస్టు చూస్తుంటే  'దిల్ రాజు' ఊపు మాములుగా లేదుగా అనిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: