తనదైన మార్క్ చిత్రాలు చేస్తూ కుటుంబ హీరోగా పేరు తెచ్చుకున్న వెంకటేష్ ప్రస్తుతం కుర్ర హీరోలతో ఒంటరిగా పోటీ తన చిత్రాలకు ప్రమాదమని గ్రహించి వరుసగా మల్టీస్టారర్ లతో ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు.ప్రస్తుతం తన మేనల్లుడు నాగ చైతన్యతో వెంకీ మామ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

అది పూర్తయిన తర్వాత మరో కుర్ర హీరోతో జత కట్టనున్నారు.ఇక వివరాలలోకి వెళ్తే తమిళ్ సూపర్ హిట్ విక్రమ్ వేద ను తెలుగు లో నిర్మించాలని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రయత్నిస్తున్నారు. ఫ్లాప్ల నుండి హిట్ ట్రాక్ ఎక్కడానికి ఎన్నో రోజుల నుండి ప్రయత్నిస్తున్నా వివి వినాయక్ దీనికి దర్శకత్వం వహించనున్నారు.

ఇందులో ఒక పాత్రకు హీరోగా వెంకటేష్ ని ఎంచుకున్నారట.మరో పాత్ర కోసం వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరించే నారా రోహిత్ ని ఎంచుకున్నారని సమాచారం.ఇద్దరు హీరోలు ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గా చిత్రాలు తీస్తూ వుంటారు.మరి వీరిద్దరూ కలిసి నటిస్తే ఫ్యామిలీ ఆడియెన్స్ కు మరియు క్లాస్ ఆడియెన్స్ కు పండుగనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: