బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ అద్భుతమైన నటి.. రెండు సార్లు నేషనల్ అవార్డు విన్నర్. అందం విషయంలో వంక పెట్టలేం.  స్టైల్ విషయం చూస్తే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ మోడల్స్ దిగదుడుపే. ఈ విషయంలో ఎవరికైనా డౌట్స్ ఉంటే 2008 లో రిలీజ్ అయిన మథుర్ భండార్కర్ ఫిలిం 'ఫ్యాషన్' చూస్తే చాలు.  అది చూడకపోయినా ఆ సినిమాలోని 'ఫ్యాషన్ కా హై ఏ జల్వా' సాంగ్ చూస్తే చాలు.  ఆ సినిమాలో నటనకు ప్రియాంక చోప్రాకు నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వస్తే.. కంగనాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది.

ఈ ఇంట్రో ఎందుకంటే కంగనా అనగానే చాలామంది ఈమధ్య గయ్యాళి అనే ఉద్దేశంతో మాత్రమే చూస్తున్నారు.  కానీ అది ఒక యాంగిల్ మాత్రమే.  విక్రమ్ అపరిచితుడు టైపులో ఆమెలో చాలా కోణాలు ఉన్నాయి.  ఆమెలో ఒక అల్ట్రా స్టైలిష్ మోడల్ కూడా ఉంది.  తాజాగా కంగనా ఒక మోడరన్ డ్రెస్ లో బయట కనిపించింది. ఇంకేముంది.. బాలీవుడ్ ఫోటోగ్రాఫర్లు క్లిక్కుమనిపించారు.  కంగనాకు సోషల్ మీడియాలో ఖాతాలు లేవు అందుకే కంగనా టీం మెయింటెయిన్ చేసే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫోటోలను పోస్ట్ చేశారు. 'మెంటల్ హై క్యా'సినిమా ట్రైలర్ కు డబ్బింగ్ చెప్పేందుకు డబ్బింగ్ స్టూడియో కు వెళ్ళినప్పుడు తీసిన ఫోటోలే ఇవి అని క్యాప్షన్ ఇచ్చారు.

వైట్ టీషర్ట్.. నానో మీటర్ల సైజ్ లో ఉన్న ఒక జీన్స్ నిక్కర్.. వైట్ స్పోర్ట్స్ షూ ధరించి మీడియావారికి హాయ్ హాయ్.. చెప్పింది. బ్లాక్ అండ్ లైట్ బ్రౌన్ షేడ్ లో ఉన్న రింగుల జుట్టుతో యమా స్టైలిష్ గా ఉంది కంగనా. ఆ నవ్వు కూడా అదిరిపోయింది.  జాన్వి కపూర్ నిక్కర్లు చూస్తేనే కత్రినా తనకు ఆందోళనగా ఉంటుందని చెప్పింది.  ఇక అంతకంటే పొట్టిగా ఉన్న ఈ క్వీన్ నిక్కర్లు  చూస్తే కత్రినా స్పృహ తప్పి పడిపోతుందేమో!

ఈ ఫోటోలకు ఇన్స్టా లో సూపర్ కామెంట్లు వచ్చాయి."నిక్కర్ క్యూట్ గా ఉంది".. "రింగుల జుట్టుతో లవ్ లో పడిపోయా".. "న్యాచురల్ బ్యూటీ క్వీన్".. "లెగ్ పీసులు సూపర్" అని కొందరు కామెంట్లు పెట్టారు.  ఒకరేమో "బికినీ ఫోటో ప్లీజ్" అని  రిక్వెస్ట్ పెట్టుకున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: