చాలామంది నటీ నటులు అవకాశం ఇచ్చి పాపులారిటి వచ్చేలా క్రెడిబులిటీని ఇచ్చిన దర్శకులను, హీరోలను కామెంట్స్ చేసి బాధ పెట్టడం చాలా సార్లు జరుగుతుంటుంది. ఇప్పుడు అలాంటి సంచలనమైన కామెంట్స్ చేశాడు ఓ పేరున్న కమెడియన్. అది కూడా గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం మీద. మణిరత్నం తర్వాత దక్షిణాది దర్శకునిగా తన సత్తాని బాలీవుడ్‌తో సహా దేశవ్యాప్తంగా అన్ని భాషలను మెప్పించిన దర్శకుడు శంకర్‌. 'జెంటిల్‌మేన్‌, భారతీయుడు, ప్రేమికుడు, ఒకే ఒక్కడు, జీన్స్‌, అపరిచితుడు, శివాజీ, రోబో' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అన్ని భాషల వాళ్ళని మెప్పించాయి. రాజమౌళి 'బాహుబలి' ముందు వరకు సౌత్ మొత్తం ఒక్క శంకర్‌ పేరే వినిపించేది. ఇక ఈయన ఇటీవల ఎక్కువగా గ్రాఫిక్స్‌ని నమ్ముకుని 'ఐ, 2.0' సినిమాలతో నిరాశపరిచిన విషయం తెలిసిందే.  


ఇక ఇదే విషయానికి వస్తే తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుని సినిమాలకు, అటు రాజకీయాలకు చెడిన ప్రముఖ కమెడియన్‌ వడివేలు. ఈయన అంతకముందు తనని కెరీర్‌ మొదట్లో ప్రోత్సహించిన విజయ్‌కాంత్‌ని పోలీస్‌స్టేషన్‌ వరకు లాగాడు. అప్పట్లో కోలీవుడ్ మొత్తం ఇదొక సెన్స్ షన్ అయింది. ఒకానొక సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌ కూడా తన కోసం వస్తే ముందుగా వడివేలు డేట్స్‌ తీసుకోమని చెప్పేవారు. కానీ వడివేలు తమిళ స్టార్స్‌ అందరినీ ఏదో మాట అంటూ కామెంట్స్ చేయడంతో తమిళ హీరోలు.. వివేక్‌, సంతానం వంటి వారిని ఎంకరేజ్‌ చేశారు. ఇక శంకర్‌ తానే నిర్మాతగా వడివేలుతో 'హింసించే 23వ రాజు పులకేసి' సినిమా నిర్మించాడు. 


ఆ తర్వాత ఈ సినిమాకి సీక్వెల్‌ కోసం కోట్లు ఖర్చుపెట్టి సెట్స్‌ వేయిస్తే వడివేలు షూటింగ్‌కి రాకుండా ఇబ్బందులు పెట్టాడు. తాజాగా మరోసారి వడివేలు శంకర్‌ని పలు మాటలు అన్నాడు. మొదటి నుంచి శంకర్‌ గ్రాఫిక్స్‌ని నమ్ముకుని బతికేస్తున్నాడని.. ఆయనకి గ్రాఫిక్స్‌కి డైరెక్షన్‌ చేయడం వచ్చు గానీ సినిమాని, నటీనటులను డైరెక్ట్‌ చేయడం రాదు..అంటూ నానా మాటలు అన్నాడు. దీంతో దర్శక దిగ్గజం వంటి శంకర్‌ని ఇలా చులకన చేయడం తమిళ ఇండస్ట్రీనే కించపరచడం అవుతుందని కొందరు తమిళ సినీ ప్రముఖులు వడివేలుపై మండిపడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: