రామ్ చరణ్ తేజ్.. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ స్టార్ గా ఉన్నాడు.  వినయ విధేయ రామ సినిమా ఫెయిల్ అయినా.. వసూళ్లు బాగానే వచ్చాయి.  అయితే, చరణ్ సినిమాల్లో ఎందుకు రావాలి అనుకున్నారు.  చిరంజీవి ప్రోద్బలంతో బలవంతంగా సినిమాల్లోకి వచ్చాడా లేదంటే తనంతట తానుగా అనుకోని వచ్చాడా.. 


చిరంజీవికి మొదటి నుంచి ఎస్వీఆర్ సినిమాలంటే చాలా ఇష్టం.  ఈ విషయాన్ని మెగాస్టార్ చాలా సందర్భాల్లో చెప్పారు కూడా.  రామ్ చరణ్ కు ఎస్వీఆర్ సినిమాలు చూడాలని పలుమార్లు సలహాలు కూడా ఇచ్చారు.  ఆ సినిమాలు చూసిన తరువాత చరణ్ సినిమాల్లోకి వచ్చారని అర్ధం అవుతుంది.  


మా నాన్నకు ఎస్వీ రంగారావు అంటే అమితమైన అభిమానం. నాన్న మాటల్లో రంగారావు గారి గొప్పతనం తీసుకున్నాను. అప్పుడే నటుడిని కావాలనే ఆలోచనకు బీజం పడినట్లు, ఎస్విఆర్ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా తెలిపారు.  ఎస్విఆర్ మరణించిన 45 సంవత్సరాల తరువాత ఆయనపై పుస్తకం రావడం విశేషం.  


ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో దీనికి డిమాండ్ పెరిగింది.  ఇందులో ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర చేస్తున్నారు.  మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా జులై 30 2020 న రిలీజ్ కాబోతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: