మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ‘జనసేన’ ఓటమి పై విశ్లేషణ చేస్తూ జనసైనికులతో చేసిన కామెంట్స్ పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తనను ఓడిద్దామని కేవలం ఒక్క భీమవరంలోనే 158 కోట్లు కొందరు ఖర్చు పెట్టారని తాత్కాలికంగా తాను ఓడిపోయినా జనం మధ్య తిరగకుండా తనను ఏ శక్తీ ఆపలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు పవన్. 

అంతేకాదు తాను తాత్కాలిక ప్రయోజనాలు ఆశించి రాజకీయాలలోకి రాలేదనీ గెలుపు ఓటములు తనను ఏమాత్రం ప్రభావితం చేయలేవు అంటూ జనసైనికులలో జోష్ ను నింపడానికి పవన్ తనవంతు ప్రయత్నాలు చేసాడు. పవన్ మాటలకు జనసైనికుల నుండి స్పందన బాగానే వస్తున్నా అతడు చేయబోయే ధీర్ఘకాలిక పోరాటాలకు ఎంతమంది పవన్ వెంట నడుస్తారు అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇది చాలదు అన్నట్లుగా కొంతమంది పవన్ వీరాభిమానులు సోషల్ మీడియాలో చేపట్టబోతున్న ‘రావాలి పవన్ కావాలి పవన్’ ఉద్యమానికి మెగా ఫ్యామిలీ పరోక్ష సహకారం ఇవ్వబోతోంది అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి. పవన్ రాజకీయాలు చేస్తూనే సినిమాలలో నటించడం కొనసాగించాలి అన్న స్పూర్తితో డిజైన్ చేయబడ్డ ‘రావాలి పవన్ కావాలి పవన్’ ఉద్యమాన్ని కేవలం సోషల్ మీడియాకే పరిమితం చేయకుండా పవన్ వీరాభిమానులు కొందరి చేత ఇది ఒక బహిరంగ ఉద్యమంగా మార్చి పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటో అందరికీ తెలిసి వచ్చేలా ఈ ఉద్యమాన్ని గైడ్ చేయాలని మెగా ఫ్యామిలీ భావిస్తున్నట్లు టాక్.

ఒకవైపు పవన్ తాను సినిమాలు చేయను మరో 20 సంవత్సరాలు ప్రజా జీవితంలో కొనసాగుతాను అని స్పష్టమైన సంకేతాలు ఇస్తుంటే పవన్ ను సినిమాలలో నటించమని అతడి వీరాభిమానులు చేయబోతున్న ఉద్యమం ఎంతమేరకు పవన్ ఆలోచనలను మారుస్తుందో చూడాలి. అయితే భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓటమి కోసం ఏకంగా 158 కోట్లు ఖర్చు పెట్టింది ఎవరు అన్న విషయమై పవన్ క్లారిటీ ఇవ్వకుండా ఇక్కడ కూడ జనసేనాని అస్పష్టంగానే మాట్లాడటం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: