టాలీవుడ్ ఇండస్ట్రీ వివాదాలకు దూరంగా ఉందేది. ఏ సమస్య వచ్చినా ఇండస్ట్రీ పెద్దలు సమస్యలు పరిష్కరించేవారు.ఏవో చిన్నా చితకా గొడవలు తప్ప టాలీవుడ్ ఇండస్ట్రీ కు చెడ్డ పేరు తెచ్చే సంఘటనలు మాత్రం ఎప్పుడూ జరగలేదు.కానీ గత కొద్దికాలం నుండి టాలీవుడ్ ఇండస్ట్రీని కొన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయి.

 

సరిగ్గా రెండేళ్ళ క్రిందట డ్రగ్స్ వివాదం సినిమా ఇండస్ట్రీ కు కొంత చెడ్డ పేరు తెచ్చింది. ఈ వివాదంలో దోషులు ఇండస్ట్రీ వాళ్ళు కాకపొయినప్పటికీ సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులకు నోటీసులు ఇవ్వటంతో ఈ వ్యవహారంపై పెద్ద చర్చే నడిచింది. కొన్ని రోజుల తరువాత ఈ వివాదాన్ని అందరూ మరిచిపోయారు.

 

సరిగ్గా ఇలాంటి సమయంలో శ్రీ రెడ్డి ఇండస్ట్రీ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. ఇండస్ట్రీ పేరును ఈ ఇష్యూ చాలా వరకు ప్రజల్లో సదభిప్రాయం లేకుండా చేసింది .పేర్లు బయటకు చెప్పకపొయినా ఇన్ డైరెక్ట్గా క్లూలు ఇస్తూ వార్తల్లో నిలిచింది. ఇటీవల తమిళ హీరోయిన్ షమ్ము కూడా విజయ్ దేవరకొండ డైరెక్టర్ ఒకరిపై ఇలాంటి ఆరోపణలు చేయడంతో ఈ విషయంపై చర్చలు మొదలయ్యాయి. ఈ సమస్యకు సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఏదో ఒక పరిష్కారం చూపించాలి. తప్పు చేసినట్లు తేలితే ఇండస్టీ నుండి బహిశ్క్రించే విధంగా రూల్స్ తెస్తే ఇలాంటి వివాదాలకు ముగింపు పలికినట్లవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: