ఫ‌ల‌క్ నుమాదాస్` డైరెక్ట‌ర్ విశ్వ‌క్ సేన్ ఇప్పుడు అంత‌టా హాట్ టాపిక్. మాస్ కంటెంట్ తోసినిమా చేసి…తాను అంతే మాస్ అని చెబుతున్నాడు. సినిమాలో బూతులు చొప్పించినందుకు బాగానే విమ‌ర్శ‌లు ఎదుర్కున్నాడు. అటుపై నోరు జారీ మ‌ళ్లీ క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. అయితే తాజాగా నిన్న‌టి సాయంత్రం జ‌రిగిన ఫ‌ల‌క్ నుమాదాస్ స‌క్సెస్ మీటో లో మ‌రోసారి నోటికి ప‌నిచెప్పాడు. త‌మ సినిమాను కొంద‌రు అడ్డుకోవాల‌ని చూస్తున్నార‌ని ఆరోపించాడు. అది కుద‌ర‌లేలు కాబ‌ట్టే ఈరోజు స‌క్సెస్ మీట్ లో మాట్లాడుతున్నా. నామీద ట్రోల్స్ న‌డుస్తున్నాయని నాకు తెలుసు. అందులో నాకు మ‌జా దొరుకుతుంది. నా సినిమా అభిమానుల నుంచి మంచి స‌పోర్ట్ ఉంది. సినిమా థియేట‌ర్లో చించిచేస్తోంది.

మీరు ఏమైనా చేసి ఉంటే ఈపాటికే చేయాలి. అలా జ‌ర‌గ‌లేదు కాబ‌ట్టే నేను ఈరోజు ఇక్క‌డ ఉన్నాను. నీకేం కాదు.మేము ఉన్నాం అన్నా అంటూ అభిమానులు మెసెజ్ లు పెడుతున్నారు. నేను మీకు చెప్పేది ఒక్క‌టే. నాకేం కాలేదు. మీరు టెన్ష‌న్ ప‌డ‌కండి. మ‌రికొంద‌ర్ జాగ్ర‌త్త‌రా బ‌య్ తొక్కేస్తారు అంటున్నారు. తొక్కించుకోవ‌డానికి నేనేం కోకాకోలా ఖాళీ టిన్ ని కాదు. తాగి పాడేసిన సిగ‌రెట్టు పీక‌ను కాదు. ఎవ‌డ్రా న‌న్ను తొక్కేది. తొక్కేవాడు ఎవ‌డో? ముందుకు రండిరా చూసుకుందాం అంటూ సీరియ‌స్ గా హెచ్చ‌రించాడు.

మొత్తానికి విశ్వ‌క్ సేన్ సినిమాతోనే కాకుండా రియ‌ల్ గాను మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు. అలాగే ఫ‌ల‌క్ నుమాదాస్ కి సీక్వెల్ గా మ‌రో సినిమా చేస్తున్న‌ట్లు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఎదురైన స‌వాళ్లు న‌డుమ‌? ఫ‌ల‌క్ నుమాదాస్ కి వ‌చ్చిన రెస్పాన్స్ నేప‌థ్యంలో పార్ట్-2 ని మ‌రింత క‌సిగా తెర‌కెక్కించ‌నున్నాడ‌ని ఆయ‌న స‌న్నిహితులంటున్నారు. రివ్యూల‌తో సంబంధం లేకుండా సినిమా భారీ లాభాలు తీసుకొచ్చింద‌ని తెలిపారు. మ‌రో విష‌యం ఏంటంటే వివ్వ‌క్ ఇప్ప‌టికే బిజీ స్టార్ అయ్యాడు. ప్ర‌స్తుతం హీరోగా బ‌య‌ట బ్యాన‌ర్ల‌లో రెండు సినిమాలు చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: