ప్రస్థుతం టాప్ హీరోలు టాప్ హీరోయిన్స్ కు సంబంధించి వారు నటిస్తున్న సినిమాల విజయం వారి కెరియర్ కు ఎంత అవసరమో సోషల్ మీడియాలో వారి ట్విటర్ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్లకు ఉన్న ఫాలోయర్స్ ను బట్టి వారి స్థాయి నిర్ణయింబడుతోంది. గతంలో సినిమాలలో మాత్రమే హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ చేస్తూ నటించేవారు.

ఇప్పుడు మారిన పరిస్థుతులలో చాలామంది టాప్ హీరోయిన్స్ ఇచ్చే ఫోటో షూట్స్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. దీనితో సోషల్ మీడియాలో కీలక స్థానం పొందిన ఇన్ స్టా గ్రామ్ సంస్థ తమ పేజ్ ని మరింత పాపులర్ చేసుకోవడం కోసం కొంతమంది హీరోయిన్స్ తో రాయబారాలు చేసి వారు ఎక్స్ పోజింగ్ చేస్తూ చేసిన ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన టాప్ హీరోయిన్స్ కు ఒకొక్క పోస్ట్ కు 10 నుంచి 20 లక్షలు పారితోషికంగా ఇస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

దీనితో కొంతమంది టాప్ హీరోయిన్స్ కు సోషల్ మీడియాలో తాము షేర్ చేసే ఫోటోలు ద్వారా సంవత్సరానికి కోటి రూపాయలకు పైగా సంపాదిస్తున్నారు అంటూ ఇండస్ట్రీలో వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఇక యంగ్ హీరోయిన్స్ విషయానికి వస్తే వారు షేర్ చేసే ఒకొక్క ఎక్స్ పోజింగ్ ఫోటోకు 50 వేల దగ్గర నుండి లక్ష రూపాయల వరకు పారితోషికం అందుతున్నట్లు టాక్. 

దీనితో చాలామంది హీరోయిన్స్ తమ సినిమాల అవకాశాల కంటే ఎక్కువగా తమ ఎక్స్ పోజింగ్ ఫోటో షూట్స్ పై దృష్టి పెడుతున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రధాన రాజకీయ పార్టీలు తాము ఎంపిక చేసే అభ్యర్ధులకు సోషల్ మీడియాలో ఎంతమంది ఫాలోయర్స్ ఉన్నారు అని లెక్కలు వేస్తున్న పరిస్థుతులలో ఈ సోషల్ మీడియా పేజీలు  సెలెబ్రెటీల కెరియర్ ను రాజకీయనాయకుల భవిష్యత్ ను ఏవిధంగా ప్రభావితం చేస్తోందో అర్ధం అవుతోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: