యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ ఆర్ ఆర్` శ‌ర వేగంగా తెర‌కెక్కుతోంది. నిన్న‌టి వ‌ర వ‌ర‌కూ ఎన్టీఆర్ పై కీల‌క యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. తాజాగా రామ్ చ‌ర‌ణ్ కూడా ట్రిప్ ను ముగించుకుని హైద‌రాబాద్ కు చేరుకు న్నాడు. రేపో మాపో షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. అల్యుమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ల‌ల‌లో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే తార‌క్ పై యాక్ష‌న్ పార్ట్ ముగింసింది. చెర్రీ జాయిన్ అయిన నేప‌థ్యంలో అత‌నిపై ప్ర‌త్యేకంగా కొన్ని స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నారు.

అనంత‌రం తార‌క్, చెర్రీ ల మ‌ధ్య కాంబినేష‌న్ సీన్స్ షూట్ చేయ‌నున్నారు. ఇంట‌ర్వెల్ కు ముందు భారీ వార్ సీన్ ఒక‌టుంది. అందులో చెర్రీ, తార‌క్ తో పాటు 2000 మంది జూనియ‌ర్ ఆర్టిస్టులు కూడా జాయిన్ అవుతున్నారుట‌. ఈ ఒక్క యాక్ష‌న్ ఎపిసోడ్ కే 50 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారుట‌. విజువ‌ల్ గా ఈ వార్ స‌న్నివేశం సినిమాకే హైలైట్ గా నిలుస్తుంద‌ని అంటున్నారు. క‌ట్ప‌ప్ప బాహుబ‌లిని చంపిన‌ప్పుడు నెల‌కొన్న స‌స్పెన్స్ లాంటి సీన్ ఒక‌టి ఇంట‌ర్వెల్ కు ముందు ప్లాన్ చేసారుట‌. అలాంటి సీన్ తోనే ఇంట‌ర్ మిస‌న్ ప‌డుతుంద‌ని అంటున్నారు.


అలాగే ఈ యాక్ష‌న్ ఎపిసోడ్ కు విదేశీ స్టంట్ మాస్ట‌ర్లు ప‌నిచేయ‌నున్నారుట‌. హై టెక్నిక‌ల్ వ్యాల్యూస్ తో ఈ సీన్ సినిమాకే త‌ల‌మానికంగా నిలుస్తుంద‌ని అంటున్నారు. 50 కోట్టు ఖర్చు చేస్తున్నారంటే? ఆ ఫైట్ ఎంత క్వాలిటీగా రిచ్ గా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. అలాగే సినిమా బ‌డ్జెట్ కూడా పెరిగిన‌ట్లు తెలుస్తోంది. తొలుత 300 కోట్లు అని ప్రచారం సాగింది. కానీ ఇప్పుడా బ‌డ్జెట్ 360 నుంచి 400 కోట్ల‌కు పెరిగింద‌ని తాజా స‌మాచారం. మొత్తం పెట్టుబ‌డి దాన‌య్య ఒక్క‌డే పెడుతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: