ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ `సైరా న‌ర‌సింహారెడ్డి` రిలీజ్ పై మ‌రోసారి నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయా? విఎఫ్ ఎక్స్ టీమ్ చేసిన ప‌నికి సైరా వాయిదా త‌ప్ప‌దా? అక్టోబ‌ర్ 2 కాస్తా..2020 సంక్రాంతికి పాకిందా? అంటే అవున‌నే ఫిలిం స‌ర్కిల్స్ లో ఓ రూమ‌ర్ వినిపిస్తోంది. వాస్త‌వానికి సైరాని స్వాత్ర‌ంత్య‌ దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయాలన్న‌ది ప్లాన్. కానీ షూటింగ్, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆల‌స్యం కావ‌డం స‌హా అదే డేట్ కు సాహో క‌ర్చీప్ వేయ‌డంతో సైరా టీమ్ వెన‌క్కి త‌గ్గింది. సినిమా ప్రారంభించి ఏడాదిన్నర‌ దాటింది. ఏడాది లోపు షూటింగ్ స‌హా అన్ని ప‌నులు పూర్తిచేసి రిలీజ్ చేయాల‌న్న‌ది మొద‌టి ప్లాన్ . కానీ సెట్స్ కు వెళ్లిన త‌ర్వాత రీ షూట్లు జ‌ర‌గ‌డంతో ప్లానింగ్ అంతా తారు మారైంది.


షూటింగ్ తో పాటే ఏక‌ధాటిగా విఎఫ్ఎక్స్ ప‌నులు జ‌రుగుతున్నా! రీ షూట్ ప్ర‌భావం అన్ని శాఖ‌ల‌పై ప‌డింది. దీంతో చేసిన ప‌నే రెండుసార్లు చేయాల్సి వ‌చ్చింది. చివ‌రికి ఎలాగూ షూటింగ్ క్లైమాక్స్ కు చేరింది ఒక్కొక్క‌టి గా అన్ని స‌ర్దుకోవ‌డంతో చిత్ర నిర్మాత రామ్ చ‌ర‌ణ్ ద‌స‌రా కానుగా అక్టోబ‌ర్ లో రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కానీ ఇప్పుడు విఎఫ్ఎక్స్ టీమ్ రూపంలో సినిమా రిలీజ్ కు క‌ష్టాలు వ‌చ్చి ప‌డ్డాయ‌ని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఉన్న నాలుగు నెల‌ల స‌మ‌యంలో విఎఫ్ ఎక్స్, గ్రాఫిక్స్ ప‌నులు పూర్త‌వ్వ‌డం క‌ష్ట‌మ‌ని మ‌రోసారి తేల్చి చెప్పిందిట‌. వాస్త‌వానికి ఈ రీజ‌న్ ముందు నుంచి వినిపిస్తోంది. కానీ అవుట్ ఫుట్ విష‌యంలో చిరంజీవిసంతృప్తిగా లేరటా..


దీంతో విఎఫ్ఎక్స్ ఎక్క‌డెక్క‌డ వీక్ గా ఉన్నాయో క్రాస్ చేక్ చేసుకుని వాట‌న్నింటిని పూర్తిచేయాలంటే ఉన్న నాలుగు నెల‌ల స‌మ‌యం స‌రిపోద‌ని నాలుగు రోజుల క్రిత‌మే విఎఫ్ఎక్స్ టీమ్ నిర్మాణ సంస్థ‌కు తేల్చి చెప్పిందట‌. అద‌నంగా మ‌రో రెండు నెల‌లు స‌మ‌యం ఇస్తే చేస్తాం? లేక‌పోతే ప్రాజెక్ట్ వ‌దులుకుంటామ‌ని క‌రాఖండీగా చెప్పేసారుట‌. అయితే ఇక్క‌డ మేక‌ర్స్ త‌ప్ప‌దిం కూడా ఉంద‌ని అంటున్నారు. ముందు ఇచ్చిన అవుట్ ఫుట్ బాగుంద‌న‌డం త‌ర్వాత వాటిలో మైన్యూర్ మిస్టేక్స్ ను పాయింట్ ఔట్ చేయ‌డంతో విఎఫ్ ఎక్స్ టీమ్ అంత క‌రాఖండీగా ఉంద‌ని చెబుతున్నారు. ఆ కండీష‌న్స్ కు ఒప్పుకుంటే సంక్రాంతికి అన్ని ప‌నులు పూర్తిచేసి ఇస్తామ‌ని నిర్మాణ సంస్థ‌కు చెప్పారుట‌. మ‌రీ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: