కొంతమంది హీరోయిన్స్ పరిస్థితి ఇండస్ట్రీలో ఎంత దారుణంగా ఉంటుందో మాటల్లో చెప్పలేము. ఒక వేళ ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయితే ఇక మళ్ళీ మొహానికి మేకప్ వేసుకునే అవకాశం ఉండదు. లేదా ఫస్ట్ సినిమా ఫలితం ఎలా ఉన్నా హీరోయిన్ బాగా చేసింది అంటే రెండో సినిమా ఛాన్స్ వస్తుంది. ఈ సినిమా గనక హిట్టైతే ఇంకో రెండు హిట్లు పడేవరకు అడపా దడపా అవకాశాలు వస్తాయి. మళ్ళీ ఫ్లాప్ పడిందా ఇక అంతే ఆ హీరోయిన్ పరిస్థితి ఒడ్డున పడ్డ చేప మాదిరి అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లోనే టాలీవుడ్‌లో ఒక హీరోయిన్ ఉంది. రొమాంటిక్ యాంగిల్ లో ఎన్ని ఫొటోలు తీసి ట్విట్టర్, ఇన్స్టా లో పెట్టినా లైక్, కామెంట్ చేసే దిక్కు లేదు పాపం. 


అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి దాదాపు హీరోలందరితో కలిసి నటించింది. నాని తో భలె భలె మగాడివోయ్, నాగ్ తో సోగ్గాడే చిన్ని నాయన వంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తన ఖాతలో ఉన్నాయి. అయినప్పటికి పాపం అన్ లక్కీ హీరోయిన్ గానే ఉండిపోయింది లావణ్య త్రిపాఠి. భలే భలే మగాడివోయ్ సూపర్ హిట్ అయ్యింది. కానీ ఆ హిట్ క్రెడిట్ మొత్తం నాని, మారుతీ ఖాతాలోనే పడింది. ఇక సోగ్గాడే పరిస్థితి కూడా అంతే. ఆ తర్వాత లావణ్య త్రిపాఠి నటించిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. ఇక ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేతిలో లేని లావణ్య త్రిపాఠి ఒకే ఒక్క సినిమా విడుదల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. 


అదే నిఖిల్ సరసన నటించిన అర్జున్ సురవరం. ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో హీరో నిఖిల్ కే క్లారిటీ లేదు. ఇక హీరోయిన్ లావణ్య కి ఎలా తెలుస్తుంది. అందుకే సోషల్ మీడియాలో హాట్ హాట్ యాంగిల్స్ తో ఫొటోస్ దిగి పోస్ట్ చేస్తుంది. ఇక చేతిలో ఒక్క అవకాశం కూడా లేని లావణ్య త్రిపాఠి ఎవరన్నా అవకాశం ఇస్తారేమోనని ఇలా 'ఒక్క ఛాన్స్ ప్లీజ్' అంటూ ఎదురు చూస్తుంది. పండగలకి, పబ్బాలకి విషెస్ చెబుతూ అందమైన ఫోజులిస్తుంది. కానీ లావణ్యకి పెద్దగా ఉపయోగం మాత్రం కనబడటం లేదు. ఎన్ని అందమైన ఫొటోస్ ఎన్ని యాంగిల్స్ లో పెట్టినా.. లావణ్యానికి మాత్రం అదృష్టం లేదనిపిస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: