నైజాంలో 'దిల్' రాజు కు టాప్ డిస్ట్రిబ్యూటర్ అనే పేరుంది. ఒక సినిమా మీద గురి పెట్టాడంటే ఆ సినిమా భారీ గా కలెక్షన్స్ ని రాబట్టాల్సిందే. అయితే గత కొంతకాలంగా నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా కొద్దిపాటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. నిర్మాతగా దిల్‌ రాజు కి 'శ్రీనివాసకళ్యాణం, లవర్‌' వంటి ఫ్లాప్స్‌ వచ్చినా ఇవ్వన్నీ లిమిటెడ్‌ బడ్జెట్‌తో తీసిన సినిమాలు కావడంతో తరువాత చేసే పెద్ద సినిమాలను చూసి బయ్యర్లు కూడా చాలా నమ్మకంగా ఉంటున్నారు. కానీ ఈ మధ్య కాలంలో దిల్‌ రాజు కి డిస్ట్రిబ్యూటర్‌గా పెద్దగా కలిసి రావడం లేదు. 'నమో వేంకటేశాయ'కి ముందు.. తర్వాత కూడా ఆయనకు చాలా సినిమాలు భారీ నష్టాలనే మిగిల్చాయి. అయినా కూడా దిల్‌ రాజు ఓ సినిమా పంపిణీహక్కులు తీసుకున్నాడంటే ఇక దానికి మిగతా రెండు తెలుగు రాష్ట్రాలలో వచ్చే హైప్‌ మామూలుగా ఉండదు. ఈ విషయం అందరికి తెలిసిందే. అంతేకాదు దిల్ రాజు ది లక్కీ హ్యాండ్ అని కూడా బయ్యర్ల నమ్మకం.


ఇక 'బాహుబలి' విషయంలో ఆలోచనలోపడిన దిల్‌రాజు.. ప్రభాస్‌ లేటెస్ట్ సినిమా 'సాహో' మీద మాత్రం బాగా గురిగా ఉన్నాడని అంటున్నారు. ఇక దిల్‌ రాజు లో ఎవరికీ తెలియని మరో లాజిక్ అండ్ టెక్నిక్‌ ఏమిటంటే.. తను ఏదైనా స్టార్‌ హీరో డేట్స్‌ సంపాదించాలని అనుకుంటే ముందుగా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి నైజాంలోనో లేక ఉత్తరాంధ్రలోనో పంపిణీహక్కులు దక్కించుకుంటాడు. ఇక ప్రభాస్‌ 'సాహో' సినిమా షూటింగ్ దాదాపు కంప్లీటయిందని, ఒక పాట షూటింగ్‌ తప్ప బ్యాలెన్స్‌ ఏమీ లేదని వార్తలు వస్తున్నాయి. దీంతో దిల్‌రాజు అలర్ట్‌ అయిపోయాడట. రాజుకు బాగా పట్టున్న నైజాం, ఉత్తరాంధ్ర ఏరియాలకు గాను 'సాహో' కోసం ఏకంగా 45 కోట్లను యువి క్రియేషన్స్‌ వారికి ఆఫర్‌ చేశాడట. ఒకరకంగా చెప్పాలంటే ఇది చాలా పెద్ద డీల్‌ కిందే లెక్క. 


ఇక దిల్ రాజు మనసు పెడితే ఇదే బడ్జెట్‌తో రెండు మూడు 'ఎఫ్‌2'లు బయటకు వస్తాయి. పోనీ ఈయనకంటే ఎక్కువ ఆఫర్‌ చేసే వారు లేరా? అంటే ఉండి ఉండవచ్చు. కానీ నైజాం, ఉత్తరాంధ్రలో డిస్ట్రిబ్యూటర్‌గా మంచి పట్టు ఉన్న దిల్‌ రాజుని యువి క్రియేషన్స్‌ వాళ్ళు వదులుకునేందుకు సిద్దంగా లేరని లేటెస్ట్ న్యూస్. ప్రభాస్‌తో దిల్‌రాజు రెండు సినిమాలు తీశాడు. వంశీపైడిపల్లిని దర్శకునిగా పరిచయం చేస్తూ తీసిన 'మున్నా' ఫ్లాప్‌ అయింది. ఆ తర్వాత 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' తో హిట్‌ కొట్టాడు. మొత్తానికి ఏది ఏమైనా దిల్‌రాజు ఆఫర్ చేసిన రేటు చూసి మిగిలిన రెండు రాష్ట్రాలలో కూడా 'సాహో' బిజినెస్‌ అదిరిపోయే లెవల్‌లో జరగడం గ్యారంటీ.. అనే మాట ఫిల్మ్ నగర్‌లో బాగా వినిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: