సినిమా అంటేనే సెట్టింగ్ వేసి షూట్ చేయాలి. భారీ సినిమాలకైతే ఈ సెట్టింగ్ లు ఇంకా భారీగా ఉంటాయి.  బాహుబలి సినిమాలాగా విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. శంకర్ సినిమాలాగే భారీ తనం కనిపిస్తుంది.  ఇలా ఎలా చెప్పుకున్నా.. అంతా భారీగానే ఉంటుంది.  


దీనికి సంబందించిన బడ్జెట్ కూడా భారీగానే ఉంటుంది.  భారీ సినిమాలు తీయడానికి కనీసం ఒకటి నుంచి రెండేళ్ల సమయం పడుతుంది.  అలా వచ్చిన సినిమాలు  ఆకట్టుకుంటాయా అంటే ఏమో చెప్పలేం.  ఇదిలా ఉంటె ఇప్పుడు మలయాళంలో భారీ బడ్జెట్ తో సినిమా చేస్తున్నారు.  


మమ్మూట్టి హీరోగా మామంగం సినిమా తెరకెక్కుతోంది.  కాలికట్ సమీపంలో 18  విస్తీరణంలో భారీగా నిర్మించిన సెట్స్ లో ఈ సినిమాను షూట్ చేస్తున్నారు.  దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఇందులో నటిస్తున్నారు.  ఎం పద్మకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  


17వ శతాబ్దానికి చెందిన కథ ఇది.  అప్పటి రాజులకు వ్యతిరేకంగా కొన్ని వందలమంది పోరాటం చేస్తారు.  ఆ పోరాటమేఈ సినిమా కథ.  విజువల్ ఎఫెక్ట్ పరంగా సినిమా బాగుంటుందని అంటున్నారు.  మరి ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే కదా.  


మరింత సమాచారం తెలుసుకోండి: