ఇంటరెస్టింగ్ గా ఉంటేనే కథను సినిమాగా మలుస్తాము.  అలా మలిచిన కథతో సినిమా చేసి హిట్ కొడుతుంటారు.  కథలు ఎక్కడి నుంచో రావు.  నిజ జీవితంలో నుంచే కథలు వస్తుంటాయి.  నిజ జీవితంలో జరిగిన ఓ కథ సినిమా కథను మించిపోయేలా ఉన్నది.  


జ్యోతిలక్ష్మి.. జయమాలిని కథ.. సినిమా కథను మించేలా ఉంటుంది.  వీళ్లిద్దరు అక్కా చెల్లెల్లు.  అక్క చెల్లెల్లు అయినప్పటికీ ఇద్దరికి వైరం ఉన్నది.  జ్యోతిలక్ష్మి ముందుగా సినిమాల్లోకి వచ్చింది. ఆ తరువాత చెల్లి జయమాలిని సినిమా రంగంలోకి వచ్చింది.  


చెల్లెలు సినిమా రంగంలోకి వచ్చినా పెద్దగా పట్టించుకునేది కాదు.  నాకెందుకులే అనే ధోరణితో ఉండేది.  అవసరం ఏముంది.. ఎందుకు పట్టించుకోవాలి అనుకుంది.  జ్యోతిలక్ష్మి ఎప్పుడైతే ప్రేమ పెళ్లి అంటూ దారితప్పిందో అక్కడి నుంచి ఆమె లైఫ్ మారిపోయింది. 


ఈలోగా జయమాలినికి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.  వరసగా సినిమాలు వచ్చాయి.  సినిమాల్లో స్టాండర్డ్ అయ్యింది.  జ్యోతిలక్ష్మి కొన్నాళ్లకు అవకాశలు తగ్గిపోయి ఇబ్బందులు పడటం మొదలుపెట్టింది.  అక్క స్థితిని చూసి చలించిపోయిన జయమాలిని ఆమెను ఆర్ధికంగా ఆదుకుంది.  అక్క మరణించిన తరువాత ఆమెకు దహనసంస్కారాలు చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: