ఎంత పెద్ద బేనర్‌ అయినా దానికి ఒక దర్శకుడు ఉన్నా కూడా పనులన్నీ నిర్మాతల కనుసన్నల్లోనే జరుగుతూ ఉంటాయి. కాబట్టి పెద్ద బేనర్లు కొత్త దర్శకులతో తీసే చిత్రాల విషయంలో హీరోలు ఆచితూచి అడుగులు వేయాల్సిందేగానీ పెద్ద బేనర్‌ కదా అని రిలాక్స్‌ కావడానికి లేదు. 


ఇక విషయానికి వస్తే తన మొదటి చిత్రం ‘ఆర్‌ఎక్స్ ‌100’తోనే హీరో కార్తికేయకి యూత్‌లో మంచి క్రేజ్‌ వచ్చింది. ఆ తర్వాత ఓ సినిమా విషయంలో గొడవలు జరిగాయి. ఇక రెండో చిత్రమే ఏకంగా కలైపులిథాను చిత్రం కావడం, జెడి చక్రవర్తి వంటి మంచి ఆర్టిస్టులు ఉండటంతో ‘హిప్పీ’కి కార్తికేయ వెంటనే ఓకే చెప్పాడు. ఈ చిత్రం విడుదలై కాస్త నెగటివ్‌ టాక్‌తోనే ముందుకు వెళ్తోంది. సోమవారానికి గానీ అసలు రిజల్ట్‌ తెలియదు.


కానీ ఖచ్చితంగా ఇది ‘ఆర్‌ఎక్స్ ‌100’ స్థాయి చిత్రం కాదని మాత్రం చెప్పవచ్చు. దాంతో అభిమానులు బాగా డీలాపడ్డారు. మొదటి చిత్రమే పెద్ద హిట్‌ అయ్యే సరికి రెండో చిత్రం విషయంలో మరీ ఎక్కువ టెన్షన్‌ పడ్డానని కార్తికేయ తెలిపాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ, తాను నటించే తదుపరి చిత్రాల గురించి చెప్పుకొచ్చాడు. ‘హిప్పీ’ తర్వాత మూడు చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. ‘గుణ369’ చేస్తున్నాను. శేఖర్‌రెడ్డి అనే దర్శకునితో ఓ చిత్రం, శ్రీసారిపల్లి అనే వ్యక్తి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాను. అలాగే సొంత బేనర్‌లో ఓ చిత్రం చేయనున్నాను. 


మరింత సమాచారం తెలుసుకోండి: