విక్టరీ వెంకటేష్ మాంచి ఊపు మీదున్నారు. ఈ ఇయర్ ఎఫ్-2 తో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. అంతేకాదు కూతురికి పెళ్ళి చేసి తండ్రిగా గొప్ప భాధ్యతను నిర్వర్తించారు. తిరిగి మళ్ళీ వెంకీ మామ షూటింగ్ లో జాయిన్ అయిపోయారు. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలను లైన్ లో పెట్టారు వెంకీ. కథలు ఒప్పించడంలో మెగా కాంపౌండ్ తర్వాత దగ్గుబాటి సురేష్ బాబు ని కథలతో కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే కథ కథనాల మీద సురేష్ బాబు కి ఉన్న క్లారిటీ చాలా తక్కువమందికి ఉంటుంది. క్యారెక్టర్ చెప్తే ఆర్టిస్ట్ ని సీన్ చెప్తే లొకేషన్ ని డ్యాం షూర్‌గా ఫైనలైజ్ చేయడం సురేష్ బాబుకే సాధ్యం.


ప్రస్తుతం వెంకటేష్ చేతిలో ఏకంగా 5 సినిమాలున్నాయి. చెప్పుకోడానికి మాత్రమే ఈ ఐదు సినిమాలు. ఒకటి ఆల్రెడీ సెట్స్ పై ఉంది. మిగతావాటిలో ఎన్ని కార్యరూపం దాలుస్తాయో చెప్పలేం. ప్రస్తుతం వెంకీ 'వెంకీమామ' చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు లేవు. ఇది కచ్చితంగా థియేటర్లలోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత సినిమానే డౌట్. వెంకీమామ తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడంటూ పుకార్లు వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి అధికారికంగా ఏ ప్రకటన రాలేదు. బెజవాడ ప్రసన్నకుమార్ చెప్పిన కథకు వెంకీ ఓకే చేశాడా లేదా అనేది అందరికీ డౌట్. 


మరోవైపు తరుణ్ భాస్కర్ తో సినిమా కూడా ఖచితమైన క్లారిటి లేకుండానే ఉంది. స్వయంగా సురేష్ బాబు ఈ సినిమా గురించి ప్రకటించినప్పటికీ, సెట్స్ పైకి వస్తే తప్ప ప్రాజెక్టును నమ్మలేం. వెంకటేశ్, తరుణ్ మధ్య ఇంకా చర్చలు సాగుతూనే ఉన్నాయంటూ ఇంటర్నల్ టాక్. మరోవైపు అనీల్ రావిపూడి, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకులు వెంకీ తో సినిమా చేయాలని చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనీల్ రావివూడి, వెంకీ మధ్య..మాటలు జరిగాయట.ఇక త్రివిక్రమ్-వెంకీ సినిమాను కూడా అఫీషియల్ గా ప్రకటించారు. కానీ ఈ రెండు సినిమాలపై ఇప్పటి వరకు ఏ క్లారిటీలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: