దగ్గుబాటి రానా టాలీవుడ్ లో బెస్ట్ యాక్టర్ లో ఒకరు.  అయన సినిమాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.  సినిమా ప్రపంచంలో పుట్టిన సినిమానే లోకంగా పెరిగిన వ్యక్తి.  పాన్ ఇండియా నటుడు. అన్ని భాషల్లో నటించిన అనుభవం ఉంది.  పాత్ర ఏదైనా సరే అయన యిట్టె చేయగల సమర్ధుడు.  


రానా గురుంచి చాలా మందికి తెలియని ఓ నిజం ఉందట.  ఆ విషయాన్ని ఆయన తండ్రి సురేష్ బాబు స్వయంగా చెప్పారు.  రానా చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే ప్రాణం.  మొదట్లో రానాను ఆర్చరీలో జాయిన్ చేశారట. కానీ గురిచూసికొట్టలేక పోయేవాడు.  


ఆ తరువాత క్రికెట్ లో జాయిన్ చేశారు.  అక్కడ కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఎందుకు కొట్టలేకపోతున్నాడో తెలియక రానాను డాక్టర్ కు చూపించారట.  వైద్యులు పరీక్షా చేసి.. రానాకు కంటి ప్రాబ్లమ్ ఉండనై చెప్పి కంటికి చికిత్స చేశారు.  కన్ను ప్లేస్ లో మరో కన్నును అమర్చారట.  కానీ చూపు రాలేదు.  


దీంతో రానాను స్పోర్ట్స్ నుంచి పక్కన పెట్టారట.   రానాకు నటన నేర్పి సినిమా రంగానికి పరిచయం చేసినట్టు సురేష్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.  కంటికి చికిత్స లేకుంటే రానా క్రికెట్ లో ఉండేవాడేమో.  


మరింత సమాచారం తెలుసుకోండి: