అక్కినేని కోడలు సమంత పెళ్లి తర్వాత కూడా తన ఫాం కొనసాగిస్తుంది. సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్స్ కెరియర్ ముగిస్తుంది. కాని సమంత విషయంలో పెళ్లి తర్వాతే సినిమాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే పెళ్లికి ముందు స్టార్ హీరోల సరసన కమర్షియల్ సినిమాల్లో నటించిన సమంత అక్కినేని కోడలుగా మారిన తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది.


రంగస్థలం హిట్ తర్వాత యూటర్న్ తో అలరించిన సమంత మజిలీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక మరో పక్క ఓ బేబీ అంటూ మరో ప్రయోగాత్మక సినిమాతో వస్తుంది. మిస్ గ్రానీ అనే కొరియన్ మూవీ రీమేక్ తో వస్తున్న ఓ బేబీ సినిమాను నందిని రెడ్డి డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో సమంతతో పాటుగా నాగ శౌర్య నటిస్తుంది.


ఈ సినిమా తర్వాత సమంత మళ్లీ ఓ హర్రర్ థ్రిల్లర్ మూవీ చేయబోతుందని తెలుస్తుంది. కోలీవుడ్ లో నయనతార లీడ్ రోల్ లో వచ్చిన డోరా సినిమాను డైరెక్ట్ చేసిన దాస్ రామస్వామి సమంతతో ఓ బైలింగ్వల్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. హర్రర్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా కథ డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది.


ఆల్రెడీ డైరక్టర్ దాస్ రామస్వామి సమంతతో స్టోరీ డిస్కషన్ చేశారట. సమంత కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో సమంత మరో నయనతారగా మారబోతుంది. ఓ బేబీ సూపర్ హిట్ అయితే ఇక మీదట సమంత అలాంటి ప్రయోగాలకు పెద్ద పీట వేస్తుందని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: