ఎన్నికల ఓటమి తరువాత పవన్ నిర్వహిస్తున్న ‘జనసేన’ సమీక్షా సమావేశాలలో అనుసరిస్తున్న వ్యూహాలు రాజకీయ వర్గాలను కూడ ఆశ్చర్య పరుస్తున్నాయి. లేటెస్ట్ గా పవన్ మాట్లాడుతూ తనకు భారతీయ జనతాపార్టీతో అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీతో ఎటువంటి శతృత్వం లేదనీ తాను మోడీని గౌరవిస్తాను కాని భయపడను అంటూ కామెంట్స్ చేసాడు.

అంతేకాదు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో అధికారం కొనసాగిస్తున్న పార్టీ నాయకులకు మోడీ అంటే భయం ఉంటుంది కానీ తనకు ఎందుకు భయం అంటూ ప్రశ్నలు వేస్తూ అధికార పార్టీని ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. దీనితో పవన్ 2024 ఎన్నికలలో తన ‘జనసేన’ పార్టీని భారతీయ జనతా పార్టీతో కలిపి కలిసి నడుస్తాడా అని సందేహాలు కలిగేలా పవన్ కామెంట్స్ ఉన్నాయి అని అంటున్నారు. 

పవన్ నిర్వహించిన సమీక్షా సమావేశాలలో ‘జనసేన’ కార్యకర్తలు కనిపిస్తున్నారు కానీ జనసేన ముఖ్యనాయకులు కూడ కనిపించక పోవడంతో ప్రస్తుతం ‘జనసేన’ కు పవన్ తప్ప మరెవ్వరూ ముఖ్య నాయకులు లేరా అన్న సందేహాలు కలుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఎన్నికల ముందు వరకు ‘జనసేన’ లో కీలక పాత్ర పోషించిన నాదెండ్ల మనోహర్ జెడి లక్ష్మీనారాయణ చివరికి నాగబాబు కూడ పవన్ నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాలకు మొదటి రోజు మాత్రమే వచ్చి ఆతరువాత రోజు నుండి రాకపోవడంతో జనసైనికులు కూడ తీవ్ర అవమానంగా భావిస్తున్నట్లు టాక్. 

ఇది చాలదు అన్నట్లుగా పవన్ ఈ సమీక్షా సమావేశాలలో మాట్లాడుతున్న ప్రతి సందర్భంలోను తీవ్ర ఆవేశానికి లోనవుతూ ఉద్వేగంతో మాట్లాడుతూ ఉండటం మరింత ఆశ్చర్యంగా మారింది అని అంటున్నారు. మరో ఆరు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు వస్తున్న నేపధ్యంలో ఆ ఎన్నికలకు వ్యూహాలు రచించకుండా ఎప్పుడో రాబోతున్న 2024 ఎన్నికలకు సిద్ధం అవ్వమని సంకేతాలు ఇస్తూ భారతీయ జనతా పార్టీ అధినాయకత్వానికి స్నేహ హస్తం అందించడంలో పవన్ వ్యూహం ఏమిటి అంటూ వైఎస్ఆర్ పార్టీ అధినాయకత్వం పవన్ మాటలలోని అర్ధాలను లోతుగా విశ్లేషిస్తున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: