బాలక్రిష్ణ. టాలీవుడ్ కి పరిచయం అవసరం లేని పేరు. బాలయ్య అంటేనే ఆబాలగోపాలం పులకరించే హీరో. వెండి తెర మీద తన తండ్రి నందమూరి తారక రామారావును తలపిస్తూ మురిపిస్తూ వైభవోపేతమైన సినీ ప్రస్తానాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్న టాప్ హీరో.


బాలయ్య 1974లో అంటే అప్పటికి 14 ఏళ్ళ వయసులో తాతమ్మ కల సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర రంగ ప్రవేశం చేశారు. ఆయన్ని తీర్చిదిద్దింది తండ్రి నందమూరే. ఆయన దర్శకత్వంలో, ఆయన సరసన బాలయ్య ఏకంగా  11 సినిమాలు చేసి నటనలో ఓనామాలు దిద్దారు. దానవీర శూర కర్ణలో వీరాభిమన్యునిగా బాలయ్య నటన ఆ రోజుల్లోనే హాట్సాఫ్ అనిపించింది. ఇక అక్బర్ సలీం అనార్కలి మూవీలో సలీం పాత్రలో  అమర ప్రేమికునిగా బాలయ్య తరుణ ప్రాయంలోనే నటనా  ప్రతిభను చాటారు.ఎన్టీయార్, బాలయ్య అన్నదమ్ములుంగా నటించిన రౌడీ రాముడు-కొంటెక్రిష్ష్ణుడు మూవీ నాటి యూత్ కి ఓ కిర్రాక్


ఇక  సోలో హీరోగా 1984లో సాహసమే జీవితం తో సినీ జీవితం ఆరంభించి మంగమ్మ గారి మనవడు మూవీతో మాస్ హీరో ఇమేజ్, ముద్దుల క్రిష్ణయ్యతో స్టార్ హీరో స్టాటస్ సంపాదించిన బాలయ్య అప్పటికే సినీ రంగంలో దూసుకుపోతున్న చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చారు. ఓ దశాబ్దమైంతే చిరంజీవి, బాలయ్య పోటాపోటీగా నటించి వెండి తెరను సుసంపన్నం  చేశారు.గౌతమీ పుత్ర శాతకర్ణి మూవీని తన వందవ సినిమాగా చేసుకున్న బాలయ్య సక్సెస్ కొట్టడమే కాదు, తెలుగు సినీలోకానికి  గొప్ప సినిమాను అందించారు.



తన తండి జీవిత చరిత్రను బయోపిక్ గా రెండు భాగాలు తీసి నటనలో నందమూరికి సిసలైన వారసుడు అనిపించుకున్నాడు. సెంచరీ కొట్టినా ఇప్పటికీ నాటౌట్ అంటున్న బాలయ్య సినిమా వయసు అక్షరాలా 45 ఏళ్ళే. త్వరలో అయన 105వ మూవీ మొదలుకాబోతోంది. వచ్చే సంక్రాంతి టార్గెట్ గా వస్తున్న ఈ మూవీతో పాటు మరిన్ని సినిమాలు కమిట్ అయిన బాలయ్య నటనే తన ప్రాణం అంటారు.



మరింత సమాచారం తెలుసుకోండి: