“సరైన దుస్తులు ధరించాలి" అని పాఠాలు చెప్పిన ఒక నెటిజన్‌ కు బుల్లితెర యాంకర్‌ మరియు సినీ నటి రష్మి గౌతం ఘాటుగానే బుద్ధి చెప్పారు.  ఇటీవల హాలీవుడ్ బాలీవుడ్ ప్రఖ్యాత హీరోయిన్  ప్రియాంకా చోప్రా ఇన్-స్టయిల్ మ్యాగజైన్‌  కవర్‌ పేజీకోసం చీర కట్టుకుని ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. అయితే ఆమె రవిక ధరించకుండా పోజిచ్చారు. దీనిపై పలువురు నెటిజన్లు మండిపడ్డారు. 

మరికొందరేమో, భారతదేశంతో రవిక లేకుండా చీర ధరించే మహిళలు చాలా మంది ఉన్నారని గుర్తు చేశారు.  ఈ మేరకు బాలీవుడ్‌ లో ఇది హాట్‌-టాపిక్‌ గా మారింది. పలు వెబ్‌సైట్లు ప్రియాంక చోప్రాకు మద్దతుగా నిలిచి కథనాలు కూడా రాశాయి. రవిక లేని చీరకట్టు పూర్వకాలం నుంచి ఉందని ఒక  వెబ్‌-సైట్‌ రాసిన కథనాన్ని రష్మి రీ-ట్వీట్‌ చేశారు. దీన్ని ఒక నెటిజన్‌ విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు.
Related image 
"ఇలాంటివి ధరించడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా! ఇలాంటి వాటి వల్లే అమ్మాయిలు పొట్టి దుస్తులు ధరిస్తూ అత్యాచారాలకు గురి అవుతున్నారు. సరైన పొడవు దుస్తులు ధరిస్తే దాదాపు నేరాల్ని తగ్గించొచ్చు. దీని గురించి కాస్త ఆలోచించండి” అంటూ రష్మి గౌతమ్‌ ను ట్యాగ్‌ చేశారు.

Image result for rashmi gautam beautiful & erotic

 
దీంతో ఆగ్రహించిన రష్మి గౌతమ్‌ అతడికి సమాధానం ఇచ్చారు. “ఇలాంటి ఆలోచనలు ఉన్న నువ్వు జన్మించడమే ఒక పెద్ద నేరం” అని అన్నారు. దీనికి సదరు నెటిజన్‌ తనట్వీట్‌నుడిలీట్‌ చేసేశారు. “మీకు నేను వ్యతిరేకం కాదు రష్మి గారు! నేను నిజం చెబుతున్నా. కొన్ని సందర్భాల్లో నేరాలు ఇలా కూడా జరుగు తుంటాయి. మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి” అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: