సిల్క్ స్మిత మంచి డ్యాన్సర్ గా అందరికి తెలుసు.  అలాగే షకీలా మసాలా సినిమాల్లో ఎక్కువగా నటించేదిని తెలుసు.  ఆమె సినిమాలు వస్తున్నాయి అంటే టాప్ హీరోలు సైతం భయపడతారనే విషయం కూడా తెలుసు.  క్రేజ్ ఉన్న హీరోలు వాళ్ళ సినిమాలు వాయిదా వేసుకునే వారని కూడా తెలుసు.  
ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న షకీలా తన మొదటి సినిమాను ఎవరితో కలిసి చేసిందో తెలుసా.. ఇంకెవరితో సిల్క్ స్మితతో కలిసి చేసింది.  ఈ సినిమా షూటింగ్ సమయంలో సిల్క్ స్మిత షకీలా చెంప పగలగొట్టింది.  కారణం ఏంటి.. ఎందుకు అంటే... 
నా తొలి చిత్రంలో ఒక బెడ్‌రూమ్‌ సీన్‌ చేయాలి. ఆమెకు చెల్లి పాత్ర నాది. ఒక సన్నివేశంలో నన్ను చెంపమీద కొట్టాలి. ‘మేడమ్‌ చెంపదెబ్బ సీన్‌ ఎలా చేయాలి’ అని నేను ఉదయం నుంచి ఆమెను అడుగుతూ ఉన్నా. ‘షాట్‌లో వచ్చేస్తుంది. నువ్వు ఏమీ చేయనక్కర్లేదు’ అంటూ చెప్పుకొంటూ వచ్చింది. అప్పుడు ఆ సీన్‌కు సంబంధించి రిహార్సల్స్‌ చేస్తున్నాం. 
అదే సమయంలో ఆ సినిమా డైరెక్టర్‌కీ నాకూ మధ్య క్రష్‌ నడుస్తోంది. రిహార్సల్స్‌ అయిపోయిన తర్వాత కెమెరా ముందుకు వెళ్లగానే సిల్క్‌స్మిత కోపంతో నా దగ్గరకు వచ్చి అందరి ముందూ లాగి పెట్టి గట్టిగా చెంప మీద కొట్టింది.   వెంటనే కన్నీళ్లు వచ్చేసాయి.  సిల్క్ స్మిత దగ్గరికి వచ్చిఓదార్చింది.  కొట్టడంతో  తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోయాను అని చెప్పింది షకీలా.  
తరువాత ఇంటికి దర్శక నిర్మాతలు వచ్చి ఓదార్చారట.   మూడు రోజుల తరువాత షకీలా తిరిగి షూటింగ్ కు వచ్చినట్టు ఓ సందర్భంలో చెప్పింది.    ఆ తరువాత సిల్క్ స్మిత తన దగ్గరకు వచ్చి నేను నీకొక విషయం చెబుతా. మనం ఆ సీన్‌ రిహార్సల్స్‌ చేస్తుంటే నువ్వు టవల్‌ కట్టుకుని ఉన్నావు కదా. అది జారిపోతే నీకే పరువు పోతుంది కదా అందుకే ఒకే షాట్‌లో చెయ్యాలని అలా కొట్టాను అని సర్ది చెప్పిందట సిల్క్ స్మిత.


మరింత సమాచారం తెలుసుకోండి: