రాజమౌళి సినిమా అంటే భారీగా ఉంటుంది.  అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.  ఎవరూ ఊహించని కథతో సినిమా చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.  కథ తీసినట్టు ఉన్నా చూడలనిపించే విధంగా ఉంటుంది.  అందుకే రాజమౌళి సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
ఇప్పుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు.  ఎన్టీఆర్ రాం చరణ్ లు హీరోలు.  షూటింగ్ యమా స్పీడ్ గా కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యంతో షూటింగ్ జరుగుతోంది.  ప్రీ ఇంటర్వెల్ సీన్స్ షూట్ జరుగుతున్నది.  ఇంతవరకు బాగానే ఉంది.  ఇప్పుడే అసలు కథ మొదలైంది.
ఇంటర్వెల్ బాంగ్ ను ఎలా షూట్ చేస్తారు.  ఇద్దరితో కలిపి షూట్ చేస్తారా లేదంటే విడివిడిగా షూట్ చేస్తారా అన్నది తెలియాలి. ఇద్దరితో కలిపి ఇంటర్వెల్ బాంగ్ ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.  ఫాన్స్ కు నచ్చినటుగా సినిమా ఉండాలి అంటే ఇద్దరి మధ్య కొన్ని సీన్స్ ఫైట్స్ తప్పనిసరి.
అప్పుడే అనుకున్నట్టుగా సినిమా  ఉంటుంది.  దీన్ని పక్కన పెడితే అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రలను ఎలా కలిపారు.. ఎలా రెండింటిని మ్యానేజ్ చేస్తున్నారు అన్నది తెలియాలి.  సినిమా కోసం దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నారు.  మరి దీనికి తగ్గట్టుగానే సినిమా ఉంటుంది కదా


మరింత సమాచారం తెలుసుకోండి: