దగ్గుబాటి కుటుంబం నుండి వెండితెరకు పరిచయమైన దగ్గుబాటి రానా సౌత్ ఇండస్ట్రీలో మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ క్రేజ్ ఏర్పర్చుకున్నాడు. అయితే ఎంత పాపులారిటీ డబ్బు ఉన్నా గాని రానాకి కంటి సమస్య ఉందని ఒక కళ్లు కనిపించదని తాను హోస్ట్ గా నిర్వహించే కార్యక్రమంలో రాణా తెలియజేయడం జరిగింది.


ఈ సమస్య తనకు చిన్నప్పటి నుండి ఉందని ఆ సమయంలో కన్ను తీసి మరోకన్ను పెట్టడం జరిగిందని..కానీ సమస్య అలాగే ఉందని...ఈ సమస్యని చిన్నప్పటినుండి రానా ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చారు రానా తండ్రి ప్రముఖ నిర్మాత సురేష్ బాబు. అంతేకాకుండా తనకు కొడుకును స్పోర్ట్స్ మ్యాన్ ను చేయాలని సురేష్ బాబు అనుకున్నారట. కానీ అది సాధ్యం కాలేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో సురేష్ బాబు తెలిపారు.


తనకు క్రీడలపై ఇష్టంతో రానాని స్పోర్ట్స్ మ్యాన్ చేయలనుకున్నారట. ఈ క్రమంలో ముందుగా రానాను ఆర్చరీలో చేర్చగా.. అతడు బాణాన్ని గురిచూసి కొట్టలేకపోయాడని సురేష్ బాబు చెప్పారు. ఆ తరువాత క్రికెట్ లో చేర్పిస్తే.. బంతిని క్యాచ్ చేయడంలో ఇబ్బందిని ఎదుర్కొన్నాడని చెప్పారు.దీంతో కొన్ని పరీక్షలు చేయిస్తే అతడికి కంటి సమస్య ఉందని వైద్యులు చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. దీంతో రానాని క్రీడల్లోకి పంపే ఆలోచన మానుకున్నట్లు చెప్పారు. ఆ తరువాత రానా సినిమాలపై ఆసక్తి పెంచుకొని ఈ రంగంవైపు వచ్చినట్లు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: