Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 20, 2019 | Last Updated 11:44 pm IST

Menu &Sections

Search

యూత్‌కు... లేడీస్‌కు... న‌చ్చే సినిమా 'ఐ ల‌వ్ యు' - విశాఖలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఉపేంద్ర

యూత్‌కు... లేడీస్‌కు... న‌చ్చే సినిమా 'ఐ ల‌వ్ యు' -  విశాఖలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఉపేంద్ర
యూత్‌కు... లేడీస్‌కు... న‌చ్చే సినిమా 'ఐ ల‌వ్ యు' - విశాఖలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఉపేంద్ర
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఓం', 'ఏ', 'సూపర్' వంటి భారీ బ్లాక్ బస్టర్స్‌తో తెలుగులో సంచలనం సృష్టించిన కన్నడ కన్నడ సూపర్ స్టార్ ఊపేంద్ర. ఆయన సినిమా తెలుగులో విడుదలవుతుందటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడతాయి. తెలుగు బాక్సాఫీస్ ను ఆయన సినిమాలు షేక్ చేసిన సందర్భాలెన్నో. కొత్త విరామం తరవాత మరోసారి తెలుగులో తన సినిమాను విడుదల చేస్తున్నారు ఉపేంద్ర.


ఉపేంద్ర హీరోగా నటించిన తాజా సినిమా 'ఐ లవ్ యు'. ‘నన్నే... ప్రేమించు’ అనేది క్యాప్షన్‌. రచితా రామ్‌ హీరోయిన్‌. తెలుగు పరిశ్రమకు ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’తో దర్శకుడిగా పరిచయం అయిన ఆర్‌. చంద్రు, శ్రీ సిద్ధేశ్వరా ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 14న సినిమాను విడుదల చేస్తున్నారు. శనివారం రాత్రి విశాఖ తీరంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. 

ఉపేంద్ర మాట్లాడుతూ "విశాఖపట్టణం అందమైన ప్రదేశం. ఇక్కడికి వచ్చాక థ్రిల్లయ్యా. ఇక్కడి ప్రజలు అదృష్టవంతులు. శని, ఆదివారాలు బీచ్ లో ఎంజాయ్ చేయవచ్చు. ఈ వాతావరణం చాలా బాగుంది. అంతకు మించి ప్రేక్షకుల ప్రేమాభిమానాలు ఇంకా బాగున్నాయి. చంద్రుగారితో నా కాంబినేషన్‌లో 'ఐ లవ్ యు' సెకండ్ ఫిల్మ్. 'రా'గా ఉంటుంది. క్లైమాక్స్ వచ్చేసరికి లేడీస్ ఫిల్మ్ అవుతుంది. అంత అందమైన, ఏమీ కోరని ప్రేమ గురించి చెప్పే సినిమా ఇది. నా సినిమాల తరహాలో రెగ్యులర్ లవ్, పోస్ట్ మార్టమ్ సన్నివేశాలు ఉంటాయి. ఎక్స్‌ట్రాడిన‌రీ ఎమోష‌న‌ల్ మూవీ. తప్పకుండా భార్యాభర్తలు వచ్చి సినిమా చూడాలి. ఫస్ట్ యూత్ ఆడియన్స్ అందరూ రండి. తరవాత భార్యాభర్తలను పంపండి. ప్రేమ అంటే ఏంటి? నిజమైన ప్రేమను ఎలా చూపించాలి? అనే చక్కటి సందేశంతో చేసిన చిత్రమిది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్, యాక్షన్, పంచ్ డైలాగ్స్ ఉంటాయి.   


ఆర్. చంద్రు మాట్లాడుతూ "నేను విశాఖపట్టణం రావడం ఇది రెండోసారి. గంటా శ్రీనివాసరావుగారు వాళ్ళబ్బాయి రవితో సినిమా చేయాలని ఫోన్ చేయడంతో తొలిసారి వచ్చాను. మలయాళ 'ప్రేమమ్' రీమేక్ చేద్దామనుకున్నాం. కానీ, కుదరలేదు. భవిష్యత్తులో తప్పకుండా రవితో సినిమా చేస్తాను. ఈ సినిమా విషయానికి వస్తే.... ఉప్పీ సార్‌ 'బ్రహ్మ' చేశాను. ఇప్పుడీ 'ఐ లవ్ యు' రెండో సినిమా. తెలుగులో కూడా నా రెండో సినిమా ఇది. ఇంతకు ముందు ల్యాంకో హిల్స్ శ్రీధర్ తెలుగులో 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' నా తొలి సినిమా. గొప్ప నటుడు, దర్శకుడు అయిన ఉపేంద్రగారితో డిస్క్స్ చేసి ఈ సినిమా చేశా. ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు. ఉదాహరణకు... టీనేజ్‌లో మన ప్రేమను  ఎవరికి చెప్పాలో? ఎలా చెప్పాలో? తెలియక చాలామంది జీవితాలను నాశనం చేసుకుంటారు. 'ఐ లవ్ యు' ఎక్కడ.. ఎవరికి... ఎలా... చెప్పాలనే సందేశంతో రూపొందించిన చిత్రమిది. అలాగే, ఉపేంద్ర సార్ క్యారెక్ట‌రైజేష‌న్ మ‌స్త్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎమోష‌న్‌తో ప్రతి ఒక్కరూ క్లైమాక్స్‌లో లేచి క్లాప్స్ కొట్టేలా ఉంటుంది. ప్రామిస్ చేస్తున్నా... క్లైమాక్స్‌లో ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి 'ఐ లవ్ యు' అని చెప్తారు. జూన్ 14న సినిమా విడుదల కానుంది. ఉపేంద్రగారితో మళ్ళీ మళ్ళీ సినిమా చేయాలనిపిస్తుంది. కుదిరితే ఏడాదికి ఒకసారి లేదా రెండేళ్లకు ఒకసారి ఉప్పీ సార్ తో సినిమా చేయాలనుకుంటున్నా" అని అన్నారు. 
మ్యూజిక్ డైరెక్టర్ డా. కిరణ్ తోటంబైల్ మాట్లాడుతూ "ఒక పెద్ద సినిమాకు నేను సంగీతం అందించడం ఇదే తొలిసారి. ఉపేంద్ర సార్, రచితా రామ్, కన్నడలో స్టార్ దర్శకుడు ఆర్. చంద్రు కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులందరూ సినిమా చూసి మాకు మద్దతు ఇవ్వాలని, కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.


సోను గౌడ మాట్లాడుతూ "అందరికీ నమస్కారం. నాకు తెలుగు కొంచెం కొంచెం వచ్చు. ఉపేంద్ర సార్, చంద్రు సార్‌తో ఫస్ట్ టైమ్ వర్క్ చేశా. కన్నడతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా విడుదలవుతోంది. ఇదే నా తొలి తెలుగు సినిమా. ప్లీజ్... సినిమా చూడండి. పాటలు, ట్రైల‌ర్‌లో నేను కనిపించలేదు. అందువల్ల, సినిమాలో నా క్యారెక్టర్ ఏంటనేది మీకు తెలియదు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశా. అదేంటో సస్పెన్స్. సినిమా చూస్తే నా క్యారెక్ట‌ర్‌కి ఉన్న‌ ఇంపార్టెన్స్ తెలుస్తుంది" అని అన్నారు. 
కెజిహెచ్ హాస్పిటల్ సూప‌ర్‌డెంట్‌ డా. అర్జున మాట్లాడుతూ "ఉపేంద్రగారి 'ఐ లవ్ యు' మూవీ పాటల విడుదల కార్యక్రమం విశాఖలో జరగడం సంతోషంగా ఉంది. ఉపేంద్రగారి సినిమాలు ఎనర్జిటిక్ గా ఉంటాయి. విశాఖలో సినిమా షూటింగ్ చేసినా... ఆడియో, ప్రీ రిలీజ్ వేడుకలు జరిగినా... ఆ సినిమా సూపర్ హిట్టే. చిత్ర బృందానికి మంచి పేరు తీసుకొస్తాయి" అని అన్నారు. 


upendra
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పోలీసులే మాకు న్యాయం చేయాలి
 మేడం టుస్సాడ్స్‌లో ప్రియాంక విగ్ర‌హం
సందీప్ కిషన్ కోసం నటులుగా మారిన దర్శకులు
రాజ్‌ తరుణ్‌ హీరోగా  కొత్త చిత్రం ప్రారంభం
 అఖిల్‌కి హీరోయిన్ కి ఇన్ని సమస్యలా?
తెలుగు నేటివెటీకి త‌గ్గ‌ట్లు మార్పులు- చేత‌న్ మ‌ద్దినేని
అమ‌లులోకి వచ్చిన వీక్లీ ఆఫ్‌
అమలాపాల్... 'ఆమె'కు సూపర్ రెస్పాన్స్!
'రణరంగం'
`గుణ 369` టీజ‌ర్‌కు అద్భుత స్పంద‌న‌..!
మ‌హాదేవ‌పురం
 ఎవ్వ‌రూ ఈ సినిమా తియ్య‌డానికి ఎంక‌రేజ్ చెయ్య‌లేదు- రాజ్ ఆర్‌
'కల్కి' రిలీజ్ రైట్స్ సొంతం చేసుకున్న శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్
టీజర్ చూడగానే సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. తప్పకుండా కౌసల్య కృష్ణమూర్తి మంచి విజయం సాధిస్తుంది - మెగాస్టార్ చిరంజీవి
ల‌య‌న్ కింగ్ కి డ‌బ్బింగ్ చెప్పిన సూప‌ర్ స్టార్ షారుక్ ఖాన్, త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్
‘ప‌లాస 1978’’ ఫ‌స్ట్ లుక్ లాంచ్
సెన్సార్ కార్యక్రమాల్లో "దర్పణం" చిత్రం..!!
జులై 5న 'రాజ్‌దూత్‌' సినిమా విడుదల
ర‌మేష్ వ‌ర్మ నుంచి రాక్ష‌సుడు
ఎన్నికలు వద్దు.. ఉపసంహరణే ముద్దు  - నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్
కృష్ణారావ్ సూప‌ర్‌మార్కెట్ మూవీ టీజ‌ర్ లాంచ్‌
ప్రెజర్ కుక్కర్' ఫస్ట్ లుక్‌ విడుదల
"ఫస్ట్ ర్యాంక్ రాజు " మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..!!
పాత‌బ‌స్తి లో షూటింగ్ పూర్తిచేసుకున్న‌ రవితేజ, వి ఐ ఆనంద్,  "డిస్కోరాజా"
రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి `విరాట‌ప‌ర్వం` ప్రారంభం
`మ‌ల్లేశం`
ప్రభాస్  "సాహో" చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించనున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్
`వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌` సినిమా స‌క్సెస్
అజ‌య్ హీరోగా స్పెష‌ల్ మూవీ 21న విడుద‌ల‌
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.