టాలీవుడ్ లో కొంత కాలంగా చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి.  కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమాలైన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని తెలిసిందే. తెలుగు సినిమాలే కాదు..కన్నడ,మళియాళ, తమిళ భాషల్లో మూవీలు సైతం తెలుగు లో అనువాదం అవుతూ మంచి విజయాలు అందుకుంటున్నాయి.  మోహన్ లాల్ నటించిన మన్నెంపులి, విజయ్ నటించిన సర్కార్, అదిరింది..కన్నడ హీరో యష్ నటించిన కేజీఎఫ్ లాంటి సినిమాలు ఇక్కడ ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యాయో తెలిసిందే.

తెలుగు లో చిన్న సినిమాలు అనుకున్న అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 సినిమాలు బోల్డ్ కంటెంట్ ఉన్నా..యూత్ కి బాగా కనెక్ట్ కావడంతో భారీ విజయం అందుకున్నాయి.  అయితే ఈ సంవత్సరం స్టార్ హీరోల సినిమాలు పెద్దగా లేదు..ఇటీవల మహేష్-వంశి పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన ‘మహర్షి’ మినహా పెద్ద సినిమాలు ఏవీ లేదు.  ఇక స్టార్ హీరోల సినిమాలంటే చిరంజీవి నటిస్తున్న ‘సైరా’, ప్రభాస్ నటిస్తున్న ‘సాహూ’. అయితే సాహూ ఆగస్టు 15 న రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు చిత్ర యూనిట్. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టేజియస్ మూవీ సైరా కూడా అక్టోబర్ 2 న విడుదల కానుంది.

 ఈసినిమా యొక్క షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఈ సినిమాలు కాకుండా రాజమౌళి తీస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ  2020 జులై 30 న రిలీజ్ అధికారంగా ప్రకటించారు. మహేష్ – అనిల్ రావిపూడి చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి లో రిలీజ్ అవుతుంది. అలానే బన్నీ – త్రివిక్రమ్ మూవీ కూడా 2020 సంక్రాంతి ని ఖాయం చేసుకున్నారు.  అంతే కాదు బాలకృష్ణ - సి కళ్యాన్ కాంబినేషన్ లో వచ్చే సినిమా కూడా వచ్చే ఏడాదికి ప్లాన్ చేసినట్లు సమాచారం. సో..ఈ లేక్కన కొంత కాలం చిన్న సినిమాలతే రాజ్యమని చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: