ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి స్టార్ హీరోయిన్ స్టేటస్ తో అలానే వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న వారిలో సమంత కూడా ఒకరు. నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమలో సమంతను అందరూ గోల్డెన్ లెగ్ అని అంటుంటారు. దానికి కారణం ఆమె చేసిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు ప్రేక్షకుల అంచనాలు అందుకుని విజయవంతం అవ్వడమే. ఇకపోతే ప్రత్యేకంగా సమంతను చూడడానికే థియేటర్ కు వెళ్లే అభిమానులు ఆమెకు ఎందరో ఉన్నారనే చెప్పాలి. 

ఇటీవల తన భర్త నాగ చైతన్యతో కలిసి నటించిన మజిలీతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సమంత, ప్రస్తుతం మంచి జోష్ తో నటిస్తున్న సినిమా ఓబేబీ. ఇందులో మొదటిసారి తాను మంచి ఎంటర్టైన్మెంట్ తో కూడా పాత్రలో నటిస్తున్నానని, అలానే తాను ఎప్పటినుండో సురేష్ ప్రొడక్షన్స్ లో నటించాలన్న కొరికే కూడా ఈ సినిమా ద్వారా తీరిందని ఇటీవల మీడియాతో సమంత చెప్పుకొచ్చింది. అయితే ఆమెను మీడియా ఇంటరాక్షన్ సమయంలో గమనించిన కొందరు మీడియా వారు సమంత గర్భవతి అని, అందుకే ఆమె తన సోషల్ మీడియా ఖాతా అయిన ట్విట్టర్ లో తన పేరును బేబీ అక్కినేని అని మార్చుకుంది అంటూ తమ మీడియా వెబ్ సైట్స్ లో పలు కథనాలు ప్రచురించడంతో అవి చివరకు సమంత వరకు చేరాయి. 

అయితే వాటికి తన ట్విట్టర్ ద్వారా బదులిచ్చిన సమంత, అవునా నేను తల్లినయ్యానా? మీరు ఎలా తెలుసుకున్నారు, కాస్త నాకు కూడా చెప్పండి అంటూ ఛలోక్తులు విసిరింది. అయితే దానినిబట్టి ఆమె తనపై వచ్చిన ఈ రూమర్ ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదని, అయితే ఎవరైనా సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి వార్తలు రాసేటపుడు కొంత నిజనిర్ధారణ చేసుకుని రాస్తే మంచిదని ఆ వార్తపై పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికల్లో తమ అభిప్రాయాలను తెల్పుతూ కామెంట్స్ చేస్తున్నారు....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: