Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 10:40 pm IST

Menu &Sections

Search

మారుతితో తేజ్.. 'ప్రతిరోజూ పండగే' !

మారుతితో  తేజ్.. 'ప్రతిరోజూ పండగే' !
మారుతితో తేజ్.. 'ప్రతిరోజూ పండగే' !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగా మేనల్లుడు  సాయి తేజ్ 'చిత్రలహరి' సక్సెస్ తో  ప్లాప్ ల పరంపరకి  కాస్త విరామం ఇచ్చాడు. దాంతో  మారుతి దర్శకత్వంలో రాబోతున్న ఈ హీరో తదుపరి సినిమా పై  నెటిజన్లు బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాకి  టైటిల్  ఏం పెడుతున్నారని కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతుంటే.. మరికొంతమంది మాత్రం  వారికి నచ్చిన టైటిల్స్ ను చెబుతున్నారు.  అయితే నిన్నటి వరకూ ఈ సినిమాకి  'భోగి' అనే టైటిల్ పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. 


తాజాగా మరో టైటిల్  తెరమీదికి వచ్చింది. 'ప్రతిరోజూ పండగే' అనే టైటిల్ నే, తమ సినిమాకి  టైటిల్ గా  దర్శకనిర్మాతలు ఫిక్స్ అయ్యారని  తెలుస్తోంది. బోగి కానీ, ఇప్పుడు ఈ  'ప్రతిరోజూ పండగే'  టైటిల్ గాని..  వింటుంటే,  సినిమా ఎలా ఉండబోతుందో  అర్ధమవుతుంది.  మొత్తానికి  మారుతి సినిమాలు టైటిల్స్  భలే  క్యాచీగా  ఉంటాయి. గతంలో 'భలే భలే మగాడివోయ్, మహానుభావుడు' లాంటి టైటిల్స్  కూడా జనంలోకి చాల ఈజీగా వెళ్లాయి. 


ఇక ఈ సినిమా కూడా  మారుతి సినిమాల శైలిలోనే  ఓ ఫన్నీ కాన్సెప్ట్ తో  డీసెంట్ కామెడీ  ఎంటెర్టైనర్ గా రాబోతుందట.  సినిమాలో  ప్లే బాయ్ పాత్రలో నటిస్తోన్న తేజ్,  ఈ సినిమా కోసం బాగా బరువు తగ్గి సన్నబడ్డాడు.  గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 


tej
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

WORK LIKE A SERVANT AND LIVE LIKE A KING