మహేష్ 26 వ సినిమా సరిలేరు నీకెవ్వరూ మే 31 వ తేదీన ప్రారంభం అయ్యింది.  ప్రస్తుతం మహేష్ విదేశాల్లో ఉన్నారు.  తిరిగి వచ్చిన తరువాత ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారు.  ఫస్ట్ షెడ్యూల్ కర్నూల్ లో పారంభం అవుతుంది.  అక్కడ లాంగ్ షెడ్యూల్ ఉండబోతున్నది. ఆ షెడ్యూల్ పూర్తయ్యాక కాశ్మీర్ వెళ్తారట.  


కాశ్మీర్ లో మంచు కొండల్లో మహేష్ సాహసాలను షూట్ చేయబోతున్నారు.  అక్కడి నుంచి రిటర్న్ జర్నీలో లవ్ స్టోరీ ఉంటుంది.  లవ్ ను సక్సెస్ చేసుకోవడానికి మహేష్ పల్లెటూరు వెళ్తాడు.  అక్కడ ఆ పల్లెటూరిలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.  జర్నీ ఎలా సాగింది అన్నది మిగతా కథ.  విజయశాంతి ఓ కీలక పాత్ర చేస్తోంది
.  
ఈ కథ వింటుంటే ఎక్కడో విన్నట్టు ఉన్నట్టు ఉన్నది.  షారుక్ హిట్ సినిమా దిల్ వాలే దుల్హనియా లేజాయంగే సినిమా స్టోరీ విన్నట్టు ఉన్నది కదా.  అలాగే వెంకటేష్ సినిమాల్లోని కథను విన్నట్టు ఉంది కదా.  కథ ఇదే అనే ప్రచారం జరుగుతున్నది.  స్క్రీన్ ప్లే చాలా బాగుంటుందని, డైలాగ్స్ తో సినిమా అదిరిపోతోంది అంటున్నారు.  


ఎఫ్ 2 లాంటి కామెడీ ఎంటర్టైనర్ ఇచ్చిన తరువాత అనిల్ కు గిరాకీ పెరిగింది.  అనిల్ పై నమ్మకంతో మహేష్ కథను ఒకే చేశారు.  మరి కథ ఇదేనా .. లేదంటే సోషల్ మీడియా ఇలాంటివి సృష్టించి సినిమాకు హైప్ తీసుకొస్తున్నారు.. చూద్దాం.  ఏది ఏమైనా అనిల్ డైలాగ్స్ బాగుంటాయి కాబట్టి సినిమా బాగుంటుందని అర్ధం చేసుకోవాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: