ప్రస్తుతం ఇటు టాలీవుడ్ సహా అటు బాలీవుడ్ లోను మంచి అవకాశాలతో దూసుకుపోతున్న తాప్సి, అక్కడ ఆకట్టుకునే వెరైటీ రోల్స్ లో నటిస్తూ ప్రేక్షకుల నుండి మంచి పేరు సంపాదిస్తోంది. ఇక ఇటీవల అక్కడ ఆమె నటించిన సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో బాలీవుడ్ నుండే ఆమెకు ఆఫర్లు మరింత పెరుగుతున్నాయి. అయితే ఆ కారణం వల్లనే ఆమె తెలుగు తోపాటు తమిళ సినిమాల్లో కూడా నటించడం తగ్గించారు ఇకపోతే ప్రస్తుతం ఆమె నటిస్తున్న లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ గేమ్ ఓవర్ ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

గతంలో మాయ, మయూరి సినిమాలు తెరకెక్కించిన అశ్విన్ శరవణన్ ఈ సినిమాని ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించారని నేడు మీడియా సమావేశంలో తాప్సి మాట్లాడుతూ చెప్పుకొచ్చింది. అంతేకాక ఒక గేమ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని, ఇకపోతే సినిమాలో తాను చాలావరకు ఒక వీల్ చైర్ లో కనపడతానని, దానికోసం తాను ఎంతో శ్రమించాల్సివచ్చిందని తాప్సి చెప్తోంది. ఇకపోతే నిర్మాతలు ఈ సినిమాకు ఎంతో ఖర్చు చేసారని, తప్పకుండా మా అందరి కష్టం వృధా అవ్వదన్న నమ్మకం తనకు ఉందని ఆమె చెపుతోంది. ఇకపోతే బాలీవుడ్ లో మీరు ఎక్కువగా క్యారెక్టర్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎందుకు నటిస్తున్నారు, 

గ్లామర్ రోల్స్ లో ఎంధుకు చేయడం లేదు అన్న ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, తనను అక్కడి ప్రజలు ఎక్కువగా మంచి క్యారెక్టర్ రోల్స్ లోనే చూడాలి అనుకుంటున్నారని, అందువల్లనే తనకు అటువంటి ఆఫర్స్ వస్తున్నాయని అంటోంది తాప్సి. ఇకపోతే మీకు పెళ్లి చేసుకోవాలని లేదా, పెళ్లి పై మీ అభిప్రాయం ఏంటి అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు తాప్సి సమాధానం ఇస్తూ, తనకు పెళ్లి పట్ల మంచి భావనే ఉందని, అయితే తనకు జీవితంలో ఎప్పుడు పిల్లలు కావాలని అనిపిస్తుందో అప్పుడే తాను పెళ్లి చేసుకుంటాను అని చమత్కరిస్తూ చెప్పుకొచ్చింది ఈ భామ.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: