కియారా అద్వానీ బాలీవుడ్ లో ఇప్పుడు క్రేజీ హీరోయిన్. తన అందంతో, నటనతో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకున్నది. నటన.. అందం.. హాట్ నెస్.. బోల్డ్ నెస్.. క్రేజ్.. ఇలా అన్ని విషయాల్లో కియారాకు ఫుల్ మార్క్స్ వస్తాయి. వీటన్నిటికి తోడుగా హాట్ ఫోటోషూట్లలో పాల్గొనడం.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది కూడా కియారాకు చాలా కామన్.  


తాజాగా కియారా మరో ఫోటో షూట్ లో పాల్గొని ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది.  ఈ ఫోటోకు కియారా క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు. జస్ట్ ఒక బటర్ ఫ్లై ఎమోజి మాత్రం పెట్టింది. బూడిద రంగు థై స్లిట్ గౌన్ లో ఒక కాలు.. ఒక చెయ్యి పైకెత్తి నిలబడింది.  మరో చేత్తో తన గౌన్ ను వయ్యారంగా సైడ్ కు పట్టుకోవడంతో మరింత అందంగా కనిపిస్తోంది. హై హీల్స్ ధరించి నిలబడడంతో కాస్త మోడరన్ టచ్ కూడా వచ్చింది. యాక్సెసరీస్ ఏవీ లేవు కానీ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మాత్రం పెట్టుకుంది.


ఇక కియారా నవ్వు మాత్రం కేకో కేక.ఈ ఫోటోకు ఇంట్రెస్టింగ్ కామెంట్లు వచ్చాయి. "నీ బ్యూటీకి లిమిట్ లేదు".. "దిశాకు సరైన పోటీ నువ్వే".. "డ్రెస్ నెమలిని గుర్తు తెస్తోందే".. "ఆస్మాన్ సే ఆయీ కోయి పరి".. "బ్యూటిఫుల్ బటర్ ఫ్లై" అంటూ కియారాను పొగుడుతూ కామెంట్లు పెట్టారు.  కియారా సినిమాల విషయానికి వస్తే 'అర్జున్ రెడ్డి రీమేక్ 'కబీర్ సింగ్' లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు అక్షయ్ కుమార్ హీరోగా నటించే 'గుడ్ న్యూస్'.. 'లాక్ష్మి బాంబ్' సినిమాల్లో నటిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: