మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్ లాంటి స్టార్ హీరోలకే బడ్జెట్ పెరిగితే తిరిగి రాబట్టుకోవడం కష్టంగా ఉంది ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి. ఈ నాలుగేళ్లలో మహేష్ కెరీర్ లో కాస్ట్ ఫెయిల్యూర్స్ బాగానే పడ్డాయి. ఈ విషయం ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరికి తెలిసిందే. కళ్లముందు ఇలాంటి ప్రత్యక్ష సాక్ష్యాలు పెట్టుకొని కూడా గోపీచంద్ తన సినిమా విషయంలో జాగ్రత్తపడడం లేదు.  మాస్ హీరో గోపీచంద్ కి గత కొంతకాలంగా సరైన హిట్ పడలేదు. హిట్ కోసం పాకులాడుతున్న గోపీచంద్ ప్రస్తుతం తిరు దర్శకత్వంలో చాణక్య అనే సినిమా చేస్తున్నాడు. అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ అంచనాల్ని దాటిపోతోంది. 


అనుకున్న బడ్జెట్ లో ఇప్పటికే 70శాతానికి పైగా ఖర్చయింది. షూటింగ్ మాత్రం 50శాతం మాత్రమే పూర్తయింది. అది కూడా టాకీ పార్ట్. మరి మిగతా షూటింగ్ పూర్తవ్వాలంటే ఇంకా పెట్టుబడి పెట్టాల్సిందే. అసలే గోపీచంద్ కు మార్కెట్ దారుణంగా పడిపోయింది. చివరికి శాటిలైట్ డీల్స్ కూడా అనుకున్నంతగా కుదరడం లేదంటే, ఈ హీరో పరిస్థితి అర్థంచేసుకోవచ్చు. ఇలాంటి టైమ్ లో చాణక్య బడ్జెట్ చేయిదాటిపోవడం అందర్నీ ఆందోళనకు గురిచేస్తోందని టాక్. రేపు సినిమా థియేటర్లలోకి వచ్చి హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, హీరో మార్కెట్ తో పోల్చిచూసుకుంటే రిటర్న్స్ అంతగా రాకపోవచ్చు. ఈ లెక్కలన్నీ సినిమా హిట్ అయినప్పుడు మాత్రమే.


గతంలో 'గౌతమ్ నందా' విషయంలో కూడా ఇలానే జరిగిందన్న విషయం అందరికి తెలిసిన సంగతే. ఆ సినిమాకు భారీగా ఖర్చుపెట్టారు. దీంతో సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కాస్ట్ ఫెయిల్యూర్ అయింది. ఇలాంటి చేదు అనుభవం పెట్టుకొని కూడా చాణక్య సినిమా బడ్జెట్ పెరిగిపోతుంటే గోపీచంద్ ఏం చేయలేకపోతున్నాడు. ఇప్పటికే కష్టాల్లో ఉన్న అనీల్ సుంకర దీన్నుంచి ఎలా బయటపడతాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: