రానా దగ్గుబాటి తన మొదటి సినిమా లీడర్ నుంచి ఇప్పటి వరకు ఎంచుకున్న సినిమాలన్నీ రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటాయన్న విషయం ఇప్పటికే అందరికి అర్థమైపోయింది. ఇక టాలీవుడ్, బాలీవుడ్ లో రానా కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాదు సినిమాలతో పాటు టీ వీ షోస్ లోను తన స్టైల్ ని చూపిస్తున్నారు. ఇక రానా సినిమాల విషయానికొస్తే హాథీ మేరీ సాథీ .. కాదన్.. అరణ్య..ఒక్కో భాషకు ఒక్కో టైటిల్. కానీ సినిమా ఒక్కటే. రానా దగ్గుబాటి నటించే సినిమా. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రెడీ అవుతోంది. కార్పొరేట్ కుట్రకు అరణ్యం నాశనమైపోతుంటే పోరాడే అడవి పుత్రుడి కథ. అతనికి అండగా నిలిచే ఏనుగుల కథ. ఈ సినిమాలో అడవిరాముడులో సీనియర్ ఎన్టీఆర్ లా రానా హీరోయిజంతో కనిపిస్తాడని ఆసక్తికరమైన వార్తలు వినిపించాయి. 


కానీ అసలు విషయం అది కాదట. ఈ సినిమాలో రానా లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అది కరెక్టే. విష్ణు విశాల్ కూడా ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ విశేషాలన్నీ దాదాపు తెలిసినవే. అయితే తెలియని కొత్త సంగతి ఏమిటంటే, ఈ సినిమాలో రానా గ్రే హెయిర్, గ్రే బియార్డ్ తో కాస్త అబౌవ్ మిడిల్ ఏజ్డ్ గెటప్ లో కనిపిస్తాడన్నది లేటెస్ట్ న్యూస్. దీనికోసం రానా తన జుట్టుకు తెల్లరంగు వేసుకోవాల్సి వచ్చిందన్నది హాట్ న్యూస్.


ప్రస్తుతం ముంబాయి, కేరళలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జంతువులతో మన భాషలో సినిమా రావడం అన్నది చాలా తక్కువైపోయింది. అలాంటిది ఏనుగులతో యాక్షన్  ఎపిసోడ్ లు వున్న సినిమా అంటే జనాలకు కాస్త ఆసక్తికరమే. మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: