విక్టరీ వెంకటేష్ అటు సూపర్ గుడ్ ఫిలింస్ లోను ఇటు సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ లోను ఎక్కువగా తమిళ సినిమాలను రీమేక్ చేసి సూపర్ హిట్స్ ని అందుకున్నాడు. కరెక్ట్‌గా చెప్పాలంటే రీమేక్ సినిమాలు వెంకటేష్ కి బాగా కలిసొచ్చాయనే చెప్పాలి. ఇక మన తెలుగు ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలు చేయాలంటే వెంకీ తర్వాతే ఎవరైనా అనే టాక్ కూడా ఉంది. అది వందకు వందశాతం నిజం కూడా. అయితే హిందీ రీమేక్స్ మాత్రం వెంకీకి అంతగా కలిసి రాలేదు. బాలీవుడ్‌లో బోల్ బచ్చన్, బాడీగార్డ్, ఓ మై గాడ్ సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. కానీ అవే సినిమాలను టాలీవుడ్‌లో వెంకీ తో తీస్తే ఫ్లాపయ్యాయి. 


ఇక మొదటి నుంచి కూడా వెంకటేశ్ రీమేక్ సినిమాల పట్ల ఆసక్తిని కనబరుస్తూనే వచ్చారు. రీసెంట్‌గా గా వెంకీ మరో రీమేక్ సినిమా చేయనున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఈమధ్యే హిందీలో విడుదలైన 'దే దే ప్యార్ దే' సినిమా బాలీవుడ్‌లో మంచి వసూళ్లనే రాబట్టింది. అజయ్ దేవగణ్ .. రకుల్ ప్రీత్ సింగ్ .. టబు ప్రధాన పాత్రలతో ఈ సినిమాను నిర్మించారు.


కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను సురేశ్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకున్నారు. వెంకటేశ్ హీరోగా ఈ సినిమాను నిర్మించనున్నారు. హిందీలో టబు చేసిన పాత్ర కోసం తెలుగులోను ఆమెనే తీసుకున్నారనేది లేటెస్ట్ న్యూస్. 28 ఏళ్ల క్రితం 'కూలీ నెం 1' సినిమాలో వెంకీతో జోడీ కట్టిన టబు, మళ్లీ ఇంతకాలానికి ఆయన సరసన కనిపించనుంది. ఇక హిందీలో రకుల్ చేసిన పాత్రకి తెలుగులోను ఆమెనే తీసుకుంటారన్న వార్త కూడా ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: