టాలీవుడ్‌లో ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాల‌కు కేరాఫ్‌గా నిలిచిన అగ్ర ద‌ర్శ‌కుడు వివి.వినాయ‌క్ త‌న కెరీర్‌కు గుడ్ బై చెప్పేస్తున్నారా ? గ‌త కొంత కాలంగా ఫామ్‌లో లేని వినాయ‌క్‌తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు కాదు క‌దా... ఓ మోస్త‌రు, మీడియం రేంజ్ హీరోలు కూడా ఇష్ట‌ప‌డ‌డం లేదా ? అంటే అవున‌నే ఆన్స‌ర్లు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. ఒక‌ప్పుడు స్టార్ హీరోల‌తో వ‌రుస హిట్లు కొట్టిన వినాయ‌క్ రాజ‌మౌళికి పోటీగా నిలిచారు.


ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీలో ముగ్గురు టాప్ డైరెక్ట‌ర్లు ఎవ‌రంటే త్రివిక్ర‌మ్‌, వినాయ‌క్‌, రాజ‌మౌళీయే  అన్న పేర్లు వినిపించేవి. అలాంటిది ఇప్పుడు వ‌రుస ప్లాపులు కాదు క‌దా.. క‌నీసం విన‌య్‌తో సినిమా చేసేందుకు చిన్న హీరోలు కూడా ఇష్ట‌ప‌డ‌డం లేదు. పూర్తిగా అవుట్ డేటెడ్ క‌థ‌ల‌తో సినిమాలు తీస్తే త‌న కెరీర్‌ను ఆయ‌న తానే నాశ‌నం చేసుకున్నాడు. ముఖ్యంగా అఖిల్ ప్లాప్ అయిన‌ప్ప‌టి నుంచి వినాయ‌క్ టేకింగ్‌పై ఎవ్వ‌రికి న‌మ్మ‌కాలు లేవు.


ఆ త‌ర్వాత చిరుతో చేసిన ఖైదీ నెంబర్ 150 సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అయినా అది రీమేక్‌. ఆ సినిమా టేకింగ్ కూడా చాలా స్లోగా, అతి జాగ్ర‌త్త‌గా ఉంటుంది. ఆ సినిమా హిట్ క్రెడిట్ వినాయ‌క్‌కు ఏ మాత్రం రాలేదు. ఆ త‌ర్వాత సాయిధ‌ర‌మ్ తేజ్‌తో తీసిన ఇంటిలిజెంట్ అట్ట‌ర్‌ప్లాప్ కావ‌డంతో వినాయ‌క్‌ను న‌మ్మే నిర్మాత‌లు కూడా ముందుకు రాని ప‌రిస్థితి. ఇంటిలిజెంట్‌ బాక్సాఫీస్ వద్ద కనీసం నాలుగు కోట్లు కూడా వసూళ్లు చేయలేక పోయింది. 


ఈ సినిమా సాయి కెరీర్ కంటే కూడా వినాయ‌క్ కెరీర్ మీదే ఎక్కువుగా ప్ర‌భావం చూపించింది. ఒక‌ప్పుడు వినాయ‌క్‌తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలే క్యూలో ఉండేవారు. ఇప్పుడు ఆయ‌న మొఖం చూసేందుకు కూడా ఎవ్వ‌రూ ఇష్ట‌ప‌డ‌ని ప‌రిస్థితి. బెల్లం ద‌గ్గ‌రే చీమ‌లు అన్న సూత్రం వినాయ‌క్‌కూ క‌రెక్టుగా వ‌ర్తిస్తోంది. బాల‌య్య విన‌య్‌కు ఛాన్స్ ఇస్తాడ‌ని అనుకున్నా ఆయ‌న కూడా ఇవ్వ‌లేదు. ఇండస్ట్రీలో ఛాన్సులు రాక‌పోవ‌డంతో విన‌య్ సినిమాల‌కు గుడ్ బై చెప్పే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఏదేనా ఒక్క హిట్ ఇచ్చి ఆయ‌న ఫామ్‌లోకి వ‌స్తాడా ?  లేదా ?  సినిమాల‌కు దూర‌మైపోతాడా ? అన్న‌ది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: