తెలుగు పరిశ్రమలో ఒకప్పుడు సీనియర్ హీరోలుగా పేరు తెచ్చుకున్న వారి కొడుకులు ఇప్పుడు పరిశ్రమలో హీరోలుగా రాణిస్తున్నారు. ఇటువంటి క్రమంలో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కూడా హీరోగా వస్తాడని అనుకున్నారు. అయితే మోక్షజ్ఞకు హీరోగా రాణించాలని ఉద్దేశ్యం లేనట్లుగా, వ్యాపారాలలో రాణించాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్.


గతంలో మోక్షజ్ఞ త్వరలో సినిమా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని, దానికోసం కొంతకాలంగా యాక్టింగ్, డాన్స్ నేర్చుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో నందమూరి అభిమానులు త్వరలోనే కొత్త వారసుడు వస్తున్నాడని సంబరపడ్డారు. అయితే, తండ్రి బలవంతం పైనే మోక్షజ్ఞ ఈ క్లాస్ కు హాజరయ్యాడని, తిరిగి వచ్చి, తన రెగ్యులర్ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడని తెలుస్తుంది.


ఇటీవల మోక్షజ్ఞ కేరాఫ్ కాఫీ షాప్ అంటూ ఓ ఆంగ్ల దినపత్రికలో ప్రత్యేక కథనం సైతం ప్రచురితమైనద. అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఏంతో ఆతృతగా ఎదురుచూస్తుంటే, తనకు సినిమాలపై ఆసక్తి లేదని చెప్పడంతో ఫాన్స్ షాక్ అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: