28 ఏళ్ల క్రితం వెంకటేష్ తో కలసి టబు కూలి నెంబర్ 1 సినిమాలో నటించింది. మళ్ళీ ఇంతకాలానికి వారిద్దరూ కలసి నటిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ లో వచ్చిన దే దే ప్యార్ దే సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. అజయ్ దేవగన్, రకుల్, టబు ప్రధాన పాత్రల్లో ఈ సినిమా నిర్మితమైంది.


పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను సురేష్ ప్రొడక్షన్స్ వారు సొంతం చేసుకున్నారు. వెంకటేష్ హీరోగా ఈ సినిమా నిర్మించనున్నారు. హిందీలో టబు చేసిన పాత్ర కోసం తెలుగులోనూ ఆమెనే తీసుకున్నారు అనేది తాజా సమాచారం. ఇక హిందీలో రకుల్ చేసిన పాత్రకి తెలుగులోనూ ఆమెనే తీసుకుంటారో లేక మరొకరిని తీసుకుంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: